హోదా గోదాలోకి ముర‌ళీమోహ‌న్‌!

murali-mohan

అంద‌రూ అయిపోయారు. ఇప్పుడు ముర‌ళీమోహ‌న్ రంగంలోకి దిగారు. రాష్ట్రానికి హోదా తెచ్చే బాధ్య‌త‌ను త‌ల‌కెత్తుకున్నారు. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో ఎక్క‌డా క‌నిపించ‌ని ఈ లోక్‌స‌భ స‌భ్యుడు అంతా అయిపోయాక ఇప్పుడు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ఎంతో అద్భుత‌మ‌ని దాంతో రాష్ట్రం స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధ్య‌మ‌ని ముర‌ళీమోహ‌న్ చెప్పారు. అయితే, ప్ర‌త్యేక హోదా కూడా కావాల్సిందేన‌ని దాని కోసం ఒత్తిడి తెస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఒక‌వైపు త‌మ‌ పార్టీ అధినేత చంద్ర‌బాబే హోదా వ‌ల్ల ఒరిగేదేం లేద‌ని మాట్లాడుతుంటే ఇప్పుడు కొత్త‌గా ముర‌ళీ మోహ‌న్ హోదా గోదాలోకి దిగ‌డం ఏమిటో అర్థం కావాడం లేద‌ని టీడీపీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ఇబ్బందిగా మార‌డంతోనే, హోదా రాలేద‌ని ఆగ్ర‌హంతో ఉన్న జ‌నాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌క‌పోతే భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావించే ఆయ‌న ఇప్పుడు హోదా రావాల్సిందేనంటున్నార‌ని తెలుస్తోంది.

అయితే, ముర‌ళీ మోహ‌న్ వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఒక‌వైపు ప్ర‌జ‌ల దృష్టిని పూర్తిగా ప్యాకేజీపైకి మ‌ళ్లించే ప‌నిలో చంద్ర‌బాబు ఉంటే మ‌రోవైపు మ‌ర‌ళీ మోహ‌న్ మ‌ళ్లీ హోదాపై ఒత్తిడి తెస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం అంత‌రార్థం ఏమిటో అర్థం కాక టీడీపీ కార్య‌క‌ర్త‌లే విస్మ‌యానికి గుర‌వుతున్నారు.

Loading...

Leave a Reply

*