ఆయ‌న వ‌ల్లే ముద్ర‌గ‌డ సిగ్గూ ల‌జ్జా వ‌దిలేశార‌ట‌!

mudragada

కాపు ఉద్య‌మం పేరుతో రోజుకో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసే ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌ళ్లీ నోరు విప్పారు. చంద్ర‌బాబుపై లేఖ‌లే అస్త్రాలుగా విరుచుకుప‌డే ముద్ర‌గ‌డ తాజాగా మ‌రోసారి ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు మ‌ళ్లీ బాబుపైకి లేఖ‌ను సంధించిన ముద్ర‌గ‌డ అందులో త‌న‌ను తాను తిట్టుకుంటూ ఏపీ సీఎంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు ద‌య‌వ‌ల్ల త‌న‌కు సిగ్గూ, ల‌జ్జా లేకుండా పోయాయ‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌కు, త‌మ జాతికి సంఘీభావం తెలిపిన వారిని సీఐడీ అధికారుల‌తో చంద్ర‌బాబు వేధిస్తున్నార‌ని ముద్ర‌గ‌డ ఆరోపించారు.

ఎన్నిక‌ల‌లో హామీ ఇచ్చిన మేర‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డం మానేసి వాటి కోసం పోరాడుతున్న వారిని వేధిస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్య‌నించారు. తాను దీక్ష చేప‌ట్టిన‌ప్పుడు రాజ‌మండ్రి ఆస్ప‌త్రికి త‌ర‌లించి అక్క‌డ ఇంజ‌క్ష‌న్ ఇచ్చి చంపాల‌ని కూడా కుట్ర చేశార‌ని ముద్ర‌గ‌డ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌ది దొంగ దీక్ష అంటూ టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నార‌ని కానీ, ప్ర‌త్యేక హోదా కోసం త‌న‌తో క‌లిసి, చంద్ర‌బాబు, లోకేశ్‌లు దీక్ష‌కు దిగాల‌ని అప్పుడు ఎవ‌రిది దొంగ దీక్షో తేలిపోతుంద‌ని స‌వాలు విసిరారు.

Loading...

Leave a Reply

*