మోడీ వెన‌క‌డుగు… నోట్ల ర‌ద్దు వెన‌క్కి?

untitled-8

నోట్ల ర‌ద్దుపై మోడీ వెన‌క‌డుగు వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? అలా చేసేందుకు ఆయ‌న ఇగో అడ్డం వ‌స్తే… క‌నీసం కొన్ని ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు రెడీ అవుతున్నారా? ఈ ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు… ప్రభుత్వ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న‌ లీకులను గ‌మ‌నిస్తే త‌న నిర్ణ‌యాన్ని పున‌స్స‌మీక్షించుకునేలా మోడీ ఆలోచ‌న‌లు సాగుతున్న‌ట్లే తెలుస్తోంది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత రెండు రోజులు గ‌డువిస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామ‌ని ఆర్బీఐ గవ‌ర్న‌ర్ చెప్పార‌ని దాంతోనే మోడీ ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌న్న‌ది తాజా క‌థ‌నం. అయితే, ఆ రెండు రోజుల త‌ర్వాత కాదు… ప‌ది రోజుల త‌ర్వాత కూడా ప‌రిస్థితి అదుపులోకి రాక‌పోవ‌డంతో ఉర్జిత్ త‌న‌ను మోసం చేశార‌ని మోడీ వాపోతున్న‌ట్లు ఆ క‌థ‌నాల సారాంశం.

కొంద‌రు అధికారుల‌పై తీవ్ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని లీకులు కూడా ఆ క‌థ‌నాల్లోని స‌మాచారం. ఇక‌, మ‌రోవైపు క‌రెన్సీ సంక్షోభం ఇప్పుడ‌ప్పుడే చ‌ల్లారేట్లు లేదు. ఏటీఎంలు కూడా ఇంకో నెల‌న్న‌ర వ‌ర‌కూ అందుబాటులోకి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. బ్యాంకులు కూడా పూర్తి స్థాయిలో చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా లేవు. చేద్దామ‌ని ప్ర‌య‌త్నించినా నోట్ల మార్పిడికి అవ‌స‌ర‌మైన న‌గ‌దు కూడా బ్యాంకుల వద్ద లేదు. దాంతో ర‌గిలిపోతున్న జ‌నంతో పాటు… ప్ర‌తిప‌క్షాలు కూడా పార్ల‌మెంట్‌లో మోడీని తూర్పార‌బ‌డుతున్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో గ‌త్యంత‌రం లేక దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు మోడీ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. మీడియా క‌థ‌నాలు… ప్ర‌భుత్వ లీకులను బ‌ట్టి అధికారుల‌పై నెపం నెట్టేసి జ‌నాగ్ర‌హాన్ని చ‌ల్లార్చేందుకు నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటారా అన్న చ‌ర్చ సాగుతోంది. అలా కాకున్నా మ‌రింత వెసులుబాటు క‌ల్పించి నోట్ల మార్పిడి గ‌డువు పెంచ‌డం, ప‌రిమితి పెంచ‌డం వంటి చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అతి త్వ‌ర‌లోనే మోడీ దీనిపై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Loading...

Leave a Reply

*