జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో డ‌బ్బు మోడీ జిమ్మిక్కేనా?

untitled-1

నోట్ల ర‌ద్దుతో మోడీపై పెరుగుతున్న ప్ర‌జాగ్ర‌హాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు బీజేపీ నేత‌లు శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. అనేక ర‌కాల లీకులు వ‌దులుతూ జ‌నాన్ని చ‌ల్లార్చాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ ఎన్నిక‌ల హామీల‌ను త్వ‌ర‌లో అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చేలా చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో రూ.10 వేలు జ‌మ చేయ‌నున్న‌ట్లు తాజాగా వార్త‌లు వ‌చ్చాయి. ఇవ‌న్నీ ఒట్టి వ‌దంతులే అని ఆ క‌థ‌నాల్లోని డొల్ల‌త‌న‌మే చెబుతోంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా న‌ల్ల డ‌బ్బంతా బ‌య‌ట‌కు తెప్పించి ఒక్కొక్క‌రి ఖాతాలో రూ.15 ల‌క్ష‌లు వేస్తాన‌ని మోడీ త‌న నోటితోనే ప‌లు స‌భ‌ల‌లో చెప్పారు. ఇప్పుడు నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో బ‌య‌ట‌కొచ్చే న‌ల్ల డ‌బ్బునంతా మోడీ ప్ర‌జ‌లకే పంచ‌బోతున్నార‌ని తొలి రోజునుంచి బీజేపీ నేత‌లు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు వ‌చ్చిన వార్త‌ల ప్ర‌కారం జీరో అకౌంటులు ఉన్న ఖాతాల‌లో రూ.10 వేలు జ‌మ చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ట‌.

అది కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ వినియోగించ‌కుండా ఒక్క రూపాయి లావాదేవీ కూడా జ‌ర‌గ‌ని ఖాతాల్లోనే ఈ మొత్తాల‌ను జ‌మ చేస్తారట‌. టోకుగా జ‌నామోదాన్ని పొందాల‌నుకున్న వారెవ‌రూ ఇలాంటిష‌ర‌తులు పెట్టి హామీలు అమ‌లు చేయ‌రు. కార‌ణం.. .జ‌న్‌ధ‌న్ ఖాతాల‌న్నీ జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో వీటిలో కొన్నింటిని కొంద‌రు వాడుకుంటున్నారు. మ‌రికొంద‌రు ప‌క్క‌న ప‌డేశారు. దేశ ప్ర‌జ‌లంద‌రితో ఖాతాలు తెరిపించి వారిలో కొంద‌రికే న‌గ‌దు జ‌మ చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తే మిగిలిన వారిలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. ఇప్పుడు క‌రెన్సీ సంక్షోభాన్ని దేశ ప్ర‌జ‌లంతా స‌మానంగా భ‌రిస్తున్నారు. అలాంట‌ప్పుడు ప‌దివేల చొప్పున కొంద‌రికే ఆర్థిక ప్ర‌యోజ‌నం క‌లిగిస్తే మిగిలిన వారంతా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మార‌డం ఖాయం. అస‌లు స‌మ‌స్య నుంచి ప్ర‌జ‌ల దృష్టిని కొంతైనా మ‌ళ్లించ‌డానికే ఇలాంటి లీకులు వ‌దులుతున్నార‌ని ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

Loading...

Leave a Reply

*