యుద్ధానికి ముందే పాక్ ని మట్టి కరిపించిన మోదీ..!

modi-and-navaj

మ‌న ద‌ళాలు మాట‌లు చెప్ప‌వు. చేత‌ల్లో చూపిస్తాయి. గ‌త వారం ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌లివి. ఆయ‌న అన్న‌ట్లుగానే బ‌ల‌గాలు చేత‌లు మొద‌లెట్టాయి. పాకిస్థాన్ దాడి త‌ర్వాత మోడీ చేసిన ప‌లు ప్ర‌సంగాలపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసిన‌ప్ప‌టికీ వాటన్నిటి వెనుక ఒక వ్యూహం ఉంద‌ని ఇప్పుడ‌ర్థ‌మైంది. ముందుగా అంత‌ర్జాతీయంగా పాకిస్థాన్ ఒంట‌రి చేసి… ఆ దేశం ఆ షాక్‌లో ఉండ‌గానే బుధ‌వారం అర్ధ‌రాత్రి మ‌న సైన్యం దాడుల‌కు దిగింది. శత్రువుల‌కు తేరుకునే అవ‌కాశం ఇవ్వ‌కుండా దాడుల‌కు దిగింది.దౌత్య‌ప‌రంగా పాకిస్థాన్‌ను ఒంట‌రి చేయ‌డంతో మోడీ విజ‌యం సాధిస్తే… ఉగ్ర‌వాదుల శిబిరాల‌ను గుర్తించి ఏరివేయ‌డంలో బ‌ల‌గాలు తొలి అడుగు వేశాయి.

పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని భూభాగంలోకి చొచ్చుకెళ్లి డ‌జ‌న్ల సంఖ్య‌లో ఉగ్ర‌వాదుల‌ను మ‌న బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి. మ‌ట్టుపెడుతున్నాయి. ఆసియా ఖండంలోని ఏ దేశ‌మూ పాకిస్థాన్‌కు ఈ విష‌యంలో స‌హ‌క‌రించేందుకు ముందుకు రాకుండా చేయ‌డంలో మోడీ ప్ర‌భుత్వం విజ‌యం సాధించింది. నిన్న‌టి వ‌ర‌కూ పాక్ అండ‌గా ఉన్న చైనా కూడా ఇప్పుడు రెండు దేశాల మ‌ధ్య వివాదాన్ని వారే ప‌రిష్క‌రించుకోవాల‌ని చెప్పేయ‌డంతో మ‌న దౌత్య వ్యూహం ఫ‌లించిన‌ట్లే అనిపించింది.నిన్న‌టికి నిన్న సార్క్ స‌ద‌స్సును భార‌త్ తిర‌స్కరించింది. హాజ‌రుకాబోమంటూ చెప్పేసింది. పాక్ మిన‌హా.. మిగిలిన ఇత‌ర దేశాలూ భార‌త్ నిర్ణ‌య‌మే మాకు శిరోధార్యం అంటూ జేజేలు ప‌లికాయి.

సార్క్‌కు వ‌చ్చేదేలేదంటూ శ్రీల‌కం, భూటాన్‌, మ‌య‌న్మార్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవ్‌లు వంటి దేశాల‌న్నీ బ‌ల్ల‌గుద్ది చెప్పేశాయి. ఇది మోదీ స‌ర్కార్ సాధించిన తొలి విజ‌యం. పాక్ ఓట‌మికి తొలి మెట్టు. ఇవాళ ఉద‌యం ఒబామా స‌ర్కార్ కూడా భార‌త్ తీసుకునే ఏ నిర్ణ‌య‌మైనా మేం స‌మ‌ర్ధిస్తామ‌ని తెలిపింది. మోదీ స‌ర్కార్ స‌మ‌ర‌భేరిని ముందే గ‌మ‌నించిన అమెరికా.. భార‌త్‌కు మ‌ద్దతు ప‌లికింది. ఇక‌, పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లో విమాన విన్యాసాల‌కు తీసుకు వ‌చ్చింది. భార‌త్ సూచ‌న‌తో ర‌ష్యా వెన‌క్కి తిరిగింది. దీంతో ఇక తిరుగే లేద‌ని నిర్ధారించుకున్న త‌ర్వాత ఆర్మీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద‌, పాక్‌ని యుద్ధానికి ముందే ఓడించింది మోదీ స‌ర్కార్‌..

 

Loading...

Leave a Reply

*