నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్‌.. కేసీఆర్‌ని ఢిల్లీకి రావాల‌న్న మోదీ…!

kcr

నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌ధాని మోడీ ఫోన్ చేసిన తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. నోట్ల ర‌ద్దుపై త‌న అసంతృప్తిని తొలి రోజు బ‌హిరంగంగా వ్య‌క్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో రోజు స్వ‌రం త‌గ్గించారు. దేశంలోని బీజేపీయేత‌ర ముఖ్య‌మంత్రుల‌తో కూట‌మి క‌ట్టేందుకు కేసీఆర్ య‌త్నిస్తున్నారంటూ వార్త‌లు కూడా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇతర రాష్ట్రాల సీఎంలు మ‌మ‌త బెన‌ర్జీ, కేజ్రీవాల్ త‌దిత‌రులు మోడీపై ప్ర‌త్య‌క్ష పోరాటాల‌కు దిగారు. దీంతో కేసీఆర్ కూడా ఇదే జ‌ట్టులో చేర‌తార‌ని ప్రచారం జ‌రిగింది. ఈ ద‌శ‌లో ప్ర‌ధాని నేరుగా కేసీఆర్‌కే ఫోన్ చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

ప్ర‌ధాని ఫోన్ చేయ‌డంతో కేసీఆర్ కూడా తమ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ఆయ‌న దృష్టికి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు. వాటిని ఓపిగ్గా విన్న ప్ర‌ధాని అన్ని త్వ‌ర‌లోనే స‌ర్దుకుంటాయ‌ని భ‌రోసా ఇచ్చిన‌ట్లు తెలిసింది. దీంతో తాను స్వ‌యంగా వ‌చ్చి అన్ని స‌మ‌స్య‌లు వివ‌రిస్తాన‌ని కేసీఆర్ కోర‌డంతో ప్ర‌ధాని అందుకు అంగీక‌రించార‌ని స‌మాచారం. అయితే, కేసీఆర్‌కు మోడీ ఫోన్ వెనుక చాలా రాజ‌కీయ‌మే ఉంద‌ని తెలుస్తోంది. దేశంలో ఏక‌మ‌వుతున్న బీజేపీయేత‌ర ముఖ్య‌మంత్రుల కూట‌మికి చెక్ పెట్టేందుకు మోడీ త‌న ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించార‌ని దాన్ని కేసీఆర్‌తోనే మొద‌లు పెట్టార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇందులో భాగంగానే కేసీఆర్‌కు ఫోన్ చేశార‌ని డిల్లీ వ‌స్తానంటే ర‌మ్మ‌ని పిలిచార‌ని స‌మాచారం. ఒక్కో ముఖ్య‌మంత్రిని ఇలా బుజ్జ‌గించి వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం మోడీ మొద‌లు పెట్టార‌ని అలాగే, ప‌నిలో ప‌నిగా త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను కూడా మోడీ ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రుల‌కు వివ‌రించి వారి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న‌ది తాజా వార్త‌.

Loading...

Leave a Reply

*