నోట్ల ర‌ద్దులో మోదీని త‌ప్పుదారి ప‌ట్టించింది అతడే.. ఆయ‌న‌పై వేటుకు సిద్ధం…!

untitled-11

ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌పై ప్ర‌ధాని వేటు వేయ‌నున్నారా? ప‌్రభుత్వం నుంచి, బీజేపీ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న లీకులు చూస్తుంట‌…ఆ దిశ‌గానే మోడీ క‌దులుతున్న‌ట్లు తెలుస్తోంది. జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా అదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఉర్జిత్ ప‌టేల్ త‌న‌ను మోసం చేశార‌ని, రెండు రోజుల్లో ఏటీఎంలు సిద్ధం చేస్తామ‌ని చెప్పి ఇప్పుడు చేతులెత్తేశార‌ని మోడీ ఆగ్ర‌హంగా ఉన్నట్లు వార్త‌లొచ్చాయి. ఇదే నిజ‌మైతే త్వ‌ర‌లోనే కొందరిపై మోడీ క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకుని ప‌ద‌కొండు రోజులు గ‌డిచినా ఇప్ప‌టికీ ప‌రిస్థితి కుదుట ప‌డ‌లేదు. జ‌నం చేతిలో డ‌బ్బుల ఆడ‌డం లేదు. ఉపాధి క‌రువైంది. క‌రెన్సీ సంక్షోబంతో పెళ్లిళ్లు జ‌ర‌గ‌డం లేదు. పేద‌ల‌కు పూట గ‌డ‌వ‌డం క‌ష్ట‌మైంది.

ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు నెపం అధికారుల‌క‌పైకి నెట్టాల‌ని చూస్తున్న‌ట్లే ఉంది. ఇక‌, ఉర్జిత్‌ప‌టేల్ విష‌యానికి వ‌స్తే… తొలి రోజు మోడీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన నిమిషాల్లోనే ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ హోదాలో ఆయ‌న కూడా మీడియా ముందుకు వ‌చ్చారు. జ‌నం ఇబ్బంది ప‌డ‌న‌క్క‌ర్లేద‌ని అన్ని ఏర్పాట్లు చేశామ‌ని రెండు రోజుల త‌ర్వాత ఏటీఎంలు వినియోగంలోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత నేటి వ‌ర‌కూ ఉర్జిత్ అనే  వ్య‌క్తి ఎక్క‌డా బ‌య‌ట‌కు క‌నిపించ‌లేదు. ఏ ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలోనూ ఆయ‌న జాడ లేదు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున అన్ని నిర్ణ‌యాల‌ను కేంద్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి హోదాలో శ‌క్తికాంత్ దాస్ అనే అధికారి ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డిస్తున్నారు. ఉర్జిత్‌ను న‌మ్మి మోసపోయినందునే ఇప్పుడు మోడీ ఆయ‌న‌ను దూరం పెడుతున్నార‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే త్వ‌ర‌లో ఉర్జిత్‌కు ఉద్వాస‌న త‌ప్ప‌దేమో అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Loading...

Leave a Reply

*