నేరం నాది కాదంటున్న మోడీ!

untitled-6

నోట్ల ర‌ద్దుతో ప్రాణాల‌కు తెగించాన‌ని మోడీ చెప్పుకున్నారు. తొలి రోజు జ‌న‌మంతా జేజేలు ప‌లుకుతుంటే పొంగిపోయారు. హీరో అంటూంటే గాల్లో తేలిపోయారు. ప‌ద‌కొండు రోజులు గ‌డిచిన త‌ర్వాత అదే జ‌నం చివాట్లు మొద‌లెట్టారు. దాంతో ఇప్పుడు నేరం మోపేందుకు ఒక వ్య‌క్తి కోసం మోడీ అణ్వేషిస్తున్నారు. నోట్ల ర‌ద్దు వంటి కీల‌క నిర్ణ‌యం తీసుకుంటే ప‌రిస్థితి ఇంత తీవ్రంగా ఉంటుందంటూ ఆర్బీఐ అధికారులు త‌న‌కు చెప్ప‌లేదంటూ ఇప్పుడు మీడియాకు లీకులు వ‌దులుతున్నారు. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జీత్ ప‌టేల్ త‌న‌ను మోసం చేశాడంటూ మోడీ ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నార‌ని ఇప్పుడు మీడియా క‌థ‌నాలు రాస్తోంది.

ఆరు నెల‌ల పాటు అత్యంత ర‌హ‌స్యంగా సంప్ర‌దింపులు జ‌రిపి… చివ‌రి వ‌ర‌కూ ర‌హ‌స్యంగా ఉంచి(బీజేపీ నేత‌లు చెబుతున్న‌ట్లు) ప్ర‌క‌టించిన ఒక నిర్ణ‌యంపై మోడీ ఇలా ప‌క్క‌వారిపై నింద‌లేయ‌డం విస్మ‌య‌క‌ర‌మే. నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం… మోడీ, ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌; ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల‌కు మాత్ర‌మే తెలుసు. వారు ముగ్గురూ మ‌రికొంద‌రు ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌ద్దు త‌ర్వాత ఎదుర‌య్యే ప‌రిణామాల‌ను కూడా కూలంకషంగా చ‌ర్చించారు. ఇదే విష‌యం మోడీ తొలి రోజు మీడియా స‌మావేశంలోనే వెల్ల‌డించారు.

కానీ ఇప్పుడు ఉర్జిత్ ప‌టేల్ త‌న‌ను మోసం చేశార‌ని, అన్ని ఏర్పాట్లు చేశామ‌ని, రెండు రోజుల్లో అంతా స‌ర్దుకుంటుంద‌ని చెప్పార‌ని మోడీ ఇప్పుడు వాపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. నిజంగా ఉర్జిత్ ప‌టేల్ స‌రైన స‌మాచారం ఇవ్వ‌కుండా మోడీని మ‌భ్య‌పెట్టిన‌ట్ల‌యితే… మ‌రి మోడి బృందం అంతా ఏం చేస్తోంది. ఆయ‌న చుట్టూ ఉన్న అత్యంత శ‌క్తిమంతులైన‌, తెలివైన అధికారులు ఎందుకు ఈ ప్ర‌మాదాన్ని ఊహించి హెచ్చ‌రించ‌లేదు. దానికి ఎవ‌రి దగ్గ‌రా స‌మాధానాలు లేవు. ఇప్పుడు సీన్ తిర‌గ‌బ‌డింది కాబ‌ట్టి…. త‌ప్పు త‌మ‌ది కాద‌ని అధికారులే త‌న‌ను మోసం చేశార‌ని మోడీ చెప్పుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు జ‌నం భావించాల్సి ఉంటుంది.

Loading...

Leave a Reply

*