జ‌గ‌న్‌కే మేక‌పాటి ఝ‌ల‌క్‌!

jagan

ప్ర‌త్యేక హోదా కోసం ఎంపీల రాజీనామా ఆస్త్రాన్ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌కు ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఈసారి ప్ర‌తిప‌క్షాల నుంచి కాకుండా సొంత పార్టీ నేత‌ల నుంచే ఆయ‌న‌కు శ‌రాఘాతం ఎదురైంది. వైసీపీ నేత‌, ఎంపీ, జ‌గ‌న్‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉండే మేక‌పోటి రాజ‌మోహ‌న్ రెడ్డి ఈ సారి జ‌గ‌న్‌కు భారీ ఝ‌ల‌క్ ఇచ్చారు. ఎప్పుడూ జ‌గ‌న్‌ను ప‌ల్లెత్తు మాట అన‌ని మేక‌పాటి ఈ సారి నోరు తెర‌వ‌డం విస్మ‌యం గొలుపుతోంది. క‌ర్నూలు స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ ఎంపీల రాజీనామా అస్త్ర‌న్ని వ‌దిలారు. అయితే, ఈ రాజీనామాల ప్ర‌క‌ట‌న‌కు త‌న పార్టీ ఎంపీల అంగీకారాన్ని జ‌గ‌న్ తీసుకోలేద‌ని తెలుస్తోంది. అయితే, అదే సభ‌లో ఉన్న ఆ జిల్లాకు చెందిన ఎంపీ బుట్టా రేణుక విధిలేని ప‌రిస్థితుల్లో తాను ఎప్పుడైనా రాజీనామా చేసేందుకు సై అని ప్ర‌క‌టించారు.

అయితే, తాజాగా ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి భిన్నంగా స్పందించారు. రాజీనామాల‌పై జ‌గ‌న్ త‌మ‌ను సంప్ర‌దించ‌లేద‌ని, త‌మ నిర్ణ‌యం అడ‌గ‌లేద‌ని ఏక‌ప‌క్షంగానే ఎంపీల రాజీనామాలు చేస్తార‌ని ప్ర‌క‌టించార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎంపీలు రాజీనామాలు చేస్తార‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్ త్వ‌ర‌లో మీరు రాజీనామాలు చేయాల్సి ఉంటుంద‌ని వారికి ఎందుకు చెప్ప‌లేద‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌కొచ్చిన అంశం. అంటే క‌ర్నూలు స‌భ‌కు వెళ్లిన జ‌గ‌న్ అప్ప‌టిక‌ప్పుడు రాజీనామాల నిర్ణ‌యం ప్ర‌క‌టించి ఉంటార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అయితే, అలా ప్ర‌క‌టించి నాలుగు రోజులు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ ఎందుకు ఎంపీల‌కు మీరు రాజీనామా చేయాల్సి ఉంటుంద‌న్న స‌మాచారం ఇవ్వ‌లేద‌న్న‌ది తాజా ప్ర‌శ్న‌.

Loading...

Leave a Reply

*