సుజ‌నాకి అదిరిపోయే షాక్‌.. మోదీ, బాబు ప‌రువు గోవిందా…?

untitled-16

ఒక‌వైపు ప్ర‌ధాని న‌ల్ల‌ధ‌నం ప‌ని ప‌ట్టే చ‌ర్య‌లు చేప‌ట్టారు. మ‌రోవైపు ఆయ‌న కేబినెట్‌లో కొలిగ్ సుజ‌నా చౌద‌రిపై మాత్రం బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన కేసులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌ధాని అనూహ్యంగా పెద్ద నోట్లు ర‌ద్దు చేయ‌డంతో దేశ ప్ర‌జ‌లంతా ఇబ్బందులు ప‌డుతున్నారు. మోడీ ఏదో మంచి చేయ‌బోతున్నార‌ని చాలామంది ఆ ఇబ్బందుల‌ను కూడా ఆనందంగా భ‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని త‌న స‌చ్ఛీల‌త‌ను నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితిని కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి క‌ల్పించారు.

బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో కోర్టులు ఇచ్చిన ఆదేశాలను బ్యాంకులు అమ‌లు చేయ‌డం లేద‌ని మారిష‌స్ బ్యాంకు మ‌ళ్లీ కోర్టుకు వెళ్లింది. ఏకంగా స‌ద‌రు బ్యాంకుల‌పై కోర్టు ధిక్కార కేసు న‌మోదు చేసింది. ఏకంగా ఒక మంత్రికి సంబంధించిన కంపెనీల విష‌యంలో ఇలా హైకోర్టు ఆదేశాల‌ను కూడా బ్యాంకులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో నేరుగా ప్ర‌ధానిపైనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రుణాల ఎగ‌వేత కేసుకు సంబంధించి గ‌త సెప్టెంబ‌రులో హైకోర్టు కొన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది.

సుజ‌నా కంపెనీల‌కు సంబంధించిన ఖాతాల వివ‌రాలు ఇవ్వాల‌ని బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఐడీబీఐ, యూకో బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు, సెంట్ర‌ల్ బ్యాంకు ఆఫ్ ఇండియా త‌దిత‌ర బ్యాంకుల‌కు కోర్టు ఆదేశించింది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ బ్యాంకులు కోర్టు ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేదు. దాంతొ మారిష‌స్ బ్యాంకు ఈ బ్యాంకుల‌పై కోర్టు ధిక్కార‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిని హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించిన‌ట్లు స‌ద‌రు బ్యాంకు తెలిపింది.

Loading...

Leave a Reply

*