షాకింగ్ న్యూస్‌.. ష‌ర్మిల కొత్త పార్టీ..?

untitled-161

అవును, ష‌ర్మిల కొత్త పార్టీ పెట్ట‌డానికి రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ఆమె వ్యూహం ఖరార‌యింది. కొన్నాళ్లుగా కొత్త పార్టీ ఏర్పాటుపై వ్యూహ ర‌చ‌న‌లో మునిగిపోయిన ష‌ర్మిల.. తాజాగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల‌ రాజ‌కీయాల‌లో ఇది పెను తుఫాను సృష్టించ‌బోతోంది.ఆర్మ్‌డ్ పోర్సెస్ ప్రొటెక్ష‌న్ ఆక్ట్‌పై తీవ్ర పోరాటం జ‌రిపిన ష‌ర్మిల‌.. సుదీర్ఘంగా 16 ఏళ్ల‌పాటు నిరాహార దీక్ష చేసింది. మ‌ణిపూర్ ఉక్కు మ‌హిళ‌గా పేరొందిన ష‌ర్మిల ఈ ఏడాది ఆగ‌స్ట్ 9న నిరాహార దీక్ష‌ను విరమించారు. ఇన్నేళ్ల‌యినా ప్ర‌భుత్వం లొంగ‌క‌పోవ‌డంతో.. ఇక‌పై ప్ర‌జ‌ల‌లో ఉండి పోరాడాలని భావిస్తున్నారు. అందుకే, ప్ర‌జా మ‌ద్ద‌తును కూడ దీసుకొని రాజ‌కీయాలలో ప్ర‌వేశించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

భారీ సంఖ్య‌లో అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాలు కైవసం చేసుకొని ప‌క్కా వ్యూహాత్మ‌క అడుగులు వేయాల‌ని సంక‌ల్పించారు ష‌ర్మిల‌.దీక్ష చేస్తున్న స‌మ‌యంలో ఆమెపై ఆత్మ‌హ‌త్య కేసు న‌మోదు చేసింది మ‌ణిపూర్ స‌ర్కార్‌. ఈ కేసును విచారించిన మ‌ణిపూర్ జిల్లా న్యాయ‌స్థానం ఆమెను నిర్దోషిగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ నెల‌లోనే కొత్త రాజ‌కీయ పార్టీ పురుడు పోసుకుంటుంద‌ని తెలిపారు. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న మ‌ణిపూర్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేసే లక్ష్యంతోనే తాను రాజ‌కీయ ప్ర‌వేశం చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది ష‌ర్మిల‌. పార్టీ విధి, విధానాలు జెండా, ఎజెండా.. అన్నీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు. మ‌రి, ఆమె ఎలాంటి మార్పులు తీసుకువ‌స్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*