లోకేశ్ క‌లియగ అభిమ‌న్యుడెలా అయ్యారు

lokesh-babu

ఇప్పుడు టీడీపీ నేత‌లంతా త‌మ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి లోకేశ్ వెన్నంటి నిలిచారు. లోకేశ్ టార్గెట్‌గా వైసీపీ నేత‌లు చేసిన‌, చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు టీడీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో బ‌దులిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేత‌లు ఇలా ఒక‌రేమిటి అంతా లోకేశ్ వెన్నంటి నిలుస్తున్నారు. లోకేశ్ ఎదుగుద‌ల‌ను చూసే ఓర్వ‌లేక వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. లోకేశ్ క‌లియుగ అభిమ‌న్యుడ‌ని ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ప్ర‌శంసించారు. ప‌ద్మ‌వ్యూహాన్ని చేధించ‌డం లోకేశ్‌కు తెలుసున‌ని వెంక‌న్న చెప్పారు. ప‌క్క రాష్ట్రంలో జీవించే జ‌గ‌న్‌కు ఏపీ గురించి మాట్లాడే అర్హ‌తే లేద‌ని కూడా వెంక‌న్న విమ‌ర్శించారు. ఇక మ‌రో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ లోకేశ్ ఎదుగుద‌ల‌ను చూసి వైసీపీ భ‌య‌ప‌డుతోంద‌ని అందుకే ప‌స‌లేని విమ‌ర్శ‌ల‌కు దిగుతోంద‌ని అన్నారు.

తండ్రి వైఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని ల‌క్ష కోట్లు సంపాదించిన జ‌గ‌న్‌కు రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి రెండున్న‌రేళ్లు అయినా ఏపీలో ఉండేందుకు కూడా మ‌న‌స్క‌రించ‌డం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తెలుగుదేశం పార్టీ ఆత్మ‌గౌర‌వ నినాదంతో పుడితే వైసీపీ అవినీతితో పుట్టింద‌ని ఎద్దేవ చేశారు.

Loading...

Leave a Reply

*