టీడీపీ నేత‌ల‌కు లోకేవ్ క్లాస్‌!

lok

ప్ర‌భుత్వం విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను మీడియాలో మ‌రింత మెరుగ్గా తిప్పికొట్టాల‌ని లోకేశ్ పార్టీ నేత‌ల‌కు సూచించారు. మీడియాలో ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు మ‌రింత‌గా ప్ర‌చారం రావాల‌ని, ఇందుకు పార్టీ నేత‌లు త‌మ వాగ్ధాటిని పెంచుకోవాల‌ని సూచించారు. గుంటూరులోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ముఖ్య నేత‌ల‌తో లోకేశ్ ఒక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వివిధ అంశాల‌పై పార్టీ అదికార ప్ర‌తినిధులు మాట్లాడుతున్న తీరు, టీవీ చ‌ర్చాగొష్టుల్లో పార్టీ త‌ర‌ఫున మాట్లాడుతున్న తీరుపైనా లోకేశ్ స‌మీక్షించారు. మీడియాలో పార్టీ వ్య‌వ‌హారాల‌కు ప్రచారం క‌ల్పించ‌డంలో ఇంకా మెరుగ్గా ఉండాల‌ని సూచించారు.

పార్టీ అధికార ప్ర‌తినిధులు, మీడియాతో మాట్లాడుతున్న నేత‌ల్లో కొంద‌రు క్రీయాశీలంగా లేర‌ని వారంతా తమ ప‌నితీరు మెరుగుప‌రుచుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. విప‌క్షాలు ప్ర‌భుత్వంపై చేస్తున్న ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌కుంటే అంతిమంగా న‌ష్టం జ‌రుగుతుంద‌ని లోకేశ్ వారిని హెచ్చ‌రించారు. ఈ విష‌యంలో పార్టీ ప్ర‌తినిధులెవ‌రూ అల‌క్ష్యం వ‌హించ‌డానికి వీల్లేద‌ని, పార్టీ వాణినిబ‌లంగా వినిపిస్తున్న వారిని ప్రోత్స‌హిస్తామ‌ని వెనుక‌బ‌డిన వారు ప‌నితీరు మెరుగుప‌రుచుకునేందుకు  అవ‌స‌ర‌మైన స‌హ‌కారం ఇస్తామ‌ని లోకేశ్ చెప్పారు.

Loading...

Leave a Reply

*