న‌న్ను వ‌దిలెయ్ సోనియా అంటున్న చిరు

chiru-and-sonia

ప్లీజ్ సోనియా లీవ్ మి ఎలోన్ అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి… అమ్మా సోనియా నీకు ద‌ణ్నం పెడ‌తానే త‌ల్లీ న‌న్ను వ‌దిలెయ్ అంటున్నాడు చిరు… పొలిటిక‌ల్ రొస్టు క‌న్నా రెస్టు మేలు అంటున్నాడు బిగ్‌బాస్‌…. ఇన్నాళ్లు పొలిటిక‌ల్ స్టెప్పులు వేసి అల‌సిపోయాను…. రాజ‌కీయాల్లో ఎన్ని స్టెప్పులు వేసినా ఎద‌గ‌లేక‌పోతున్నాను… సినిమాల్లో స్టెప్పులు వేసుకుంటాను… అదే నాకు బాగా క‌లిసివ‌చ్చింది అంటున్నాడు చిరంజీవి… త‌న వెంట ప‌డొద్ద‌ని, త‌న‌ను వ‌దిలెయ్యాల‌ని సోనియాకు విజ్ఞ‌ప్తి చేస్తున్నాడు శంక‌ర్ దాదా… అస‌లు సంగ‌తి ఏంటంటే రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో కాంగ్రెస్ చ‌చ్చిపోయింది… విభ‌జ‌న‌పై జ‌నాగ్ర‌హం విరుచుకుప‌డ‌డంతో చెయ్యి పార్టీని గొయ్యి తీసి పూడ్చిపెట్టారు జ‌నం…పార్టీలో పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ఒక్క‌డే మిగిలాడు…

కొద్దోగొప్పో పేరున్న నేత‌లు సూట్‌కేసులు స‌ర్దుకుని టీడీపీ, వైసీపీల్లోకి జంప‌యిపోయారు… ఇక ఏపీలో కాంగ్రెస్‌కు మిగిలిన ఏకైక ఆశాకిర‌ణం చిరంజీవి మాత్ర‌మే…. సోనియా, రాహుల్ ఏపీకి వ‌స్తే వాళ్ల‌ను జ‌నం త‌రిమికొట్టేలా ఉన్నారు… దీంతో చిరంజీవిని ఏపీ రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా మార్చి కాంగ్రెస్‌కు రాష్ట్రంలో మ‌ళ్లీ ప్రాణం పోయాల‌ని సోనియా భావిస్తోంది… మెగాస్టార్ చిరంజీవికి ఇప్ప‌టికీ ల‌క్ష‌ల‌మంది అభిమానులు ఉన్నారు.. అంతేకాదు రాష్ట్రంలోనే అత్యంత బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గ‌మైనా కాపులు కూడా చిరుకు కాపు కాస్తారు… దీన్ని దృష్టిలో ఉంచుకుని సోనియా పెద్ద స్కెచ్చే వేసింది. మేక‌ప్‌కు ప్యాక‌ప్ చెప్పి, సినిమాలుగినిమాలు క‌ట్టిపెట్టి కాంగ్రెస్‌ను మ‌ళ్లీ ఏపీలో బ‌తికించేలా చిరు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టు అంటూ చిరంజీవికి హిత‌బోధ చేసింది మేడ‌మ్‌…

పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొనండి అని చెప్పిందిట‌… ఇప్ప‌టికే చిరంజీవి చాలా రోజులుగా పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేరు… కాంగ్రెస్ రాజ‌కీయాల‌కు ఈమ‌ధ్య దూరంగా ఉంటూ వ‌చ్చారు ఆయ‌న‌… దీంతో కాంగ్రెస్ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌గా పాల్గొనండి చిరంజీవి అని మేడ‌మ్ చెబితే బిగ్‌బాస్ స‌సేమిరా అన్నాట్ట‌… ఇప్ప‌టికి న‌న్ను వ‌దిలెయ్యండి మేడ‌మ్‌… నావెంట పడొద్దు… నేను హాయిగా సినిమాలు చేసుకుంటాను అని చిరంజీవి తెగేసి చెబుతుండ‌డంతో సోనియా షాక్ తిందిట‌.

Loading...

Leave a Reply

*