టీడీపీలోకి ల‌గ‌డ‌పాటి?

tdp

రాష్ట్ర విభ‌జ‌న‌తో రాజ‌కీయ స‌న్యాసం చేసిన నేత ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌. రాష్ట్రాన్ని స‌మైక్యంగా ఉంచాలంటూ ఉద్య‌మించిన ఆయ‌న విడిపోతే ఇక రాజ‌కీయాల్లో కొన‌సాగ‌బోనంటూ ప్ర‌క‌ట‌న చేశారు. అన్న‌ట్లుగానే ఆ త‌ర్వాత ఎక్క‌డా రాజ‌కీయతెర‌పై క‌నిపించ‌లేదు. రాజ‌కీయ నేత‌ల ఇళ్ల‌లో జ‌రిగే వేడుక‌ల‌లో మాత్ర‌మే ల‌గ‌డ‌పాటి ఈ మ‌ధ్య త‌ళుక్కుమంటున్నారు. అంత‌కుమించి ఏ రాజ‌కీయ కార్య‌క్మంలో కానీ, రాజ‌కీయ సంబంధ విష‌యాల‌పై కానీ ఆయ‌న క‌నిపించ‌డం లేదు. స్పందించ‌డం లేదు. అలాంటి ల‌గ‌డ‌పాటి ఇప్పుడు టీడీపీలో చేరేందుకు రెడీ అయిన‌ట్లు స‌మాచారం. గ‌త కొన్నాళ్లుగా ల‌గ‌డ‌పాటి టీడీపీలోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే, దానిపై ఆయ‌న కానీ, ఆయ‌న త‌ర‌ఫునకానీ ఎవ‌రూ స్పందించ‌లేదు. ఇదే వార్త మ‌ళ్లీ ఇప్పుడు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అతి త్వ‌ర‌లో రాజ‌గోపాల్ సైకిల్ ఎక్క‌బోతున్నార‌ని ఇందుకు టీడీపీ నేత‌ల నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింద‌ని తాజా స‌మాచారం. కాంగ్రెస్‌, వైసీపీ నేత‌ల‌ను వ‌రుస‌బెట్టి పార్టీలోకి లాగేస్తున్న చంద్ర‌బాబు ల‌గ‌డ‌పాటి వంటి నేత‌ల‌పై కూడా క‌న్నేసి వారిని పార్టీలోకి తేవాల‌ని టీడీపీ నేత‌ల‌ను ఆదేశించార‌ట‌. అధినేత ఆదేశాల‌తో రంగంలోకి దిగిన నేత‌లు ల‌గ‌డ‌పాటిని టీడీపీ గూటికి తీసుకొచ్చే ప‌నిలో స‌ఫ‌ల‌మైన‌ట్లు స‌మాచారం. రాబోయే రోజుల్లో టీడీపీలోకి మ‌రెన్ని వ‌ల‌స‌లు ఉండ‌బోతున్నాయో.

Loading...

Leave a Reply

*