ఎన్టీఆరే ఓడిపోయారు… కేసీఆర్ ఎంత‌!

untitled-11

కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి మంచి ఊపుమీదున్న కేసీఆర్‌కు త్వర‌లో షాక్ త‌ప్పద‌ని కాంగ్రెస్ హెచ్చరించింది. ఇందుకు ఎన్టీఆర్ ఉదంతాన్ని కాంగ్రెస్ నేత‌లు గుర్తు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో తామే గెలుస్తామ‌ని అందుకు ఇప్పుడు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలే మెట్టుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని కేసీఆర్ చెప్పడాన్ని కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఎద్దేవ చేశారు. గ‌తంలో తెలంగాణ‌లో త‌న చారిత్రాత్మక చ‌ర్యల ద్వారా మండ‌ల వ్యవ‌స్థను ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ఓడిపోయార‌ని…

అలాంటి ఇప్పుడు కేసీఆర్ ఎంత‌ని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు నిజంగా ద‌మ్ముంటే… ఇత‌ర పార్టీల్లోంచి టీఆర్ఎస్‌లో చేరిన వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నిక‌ల‌లో గెల‌వాల‌ని కోమ‌టిరెడ్డి స‌వాలు విసిరారు. అలా ఉప ఎన్నిక‌ల‌లో టీఆర్ ఎస్ గెలిస్తే వ‌చ్చే 2019 ఎన్నిక‌ల‌లో తాము పోటీ కూడా చేయ‌బోమ‌ని ఆయ‌న స‌వాలు విసిరారు. ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ ఎస్ నేత‌ల్లో హ‌రీశ్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్ మాత్రమే తిరిగి గెలుస్తార‌ని కోమ‌టిరెడ్డి జోస్యం చెప్పారు.

Loading...

Leave a Reply

*