కొడాలి నాని స్కెచ్‌.. ఎన్టీఆర్‌తో కొత్త పార్టీ…!

untitled-7

వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ ఊహించని విధంగా కీలక మార్పులు జరగబోతున్నాయా? అవి మరింత వేడెక్కించనున్నాయా? అంటే అవుననే అంటున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే అటు అధికార పార్టీ టీడీపీ, ఇటు ప్రతిపక్షం వైసీపీ పోటీ పడనున్నాయి. వీటికి తోడు నేను కూడా వస్తున్నా..కాసుకోండి అంటూ..ఈ మధ్య అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో తాను కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించాడు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రలో పవన్ కు యువత నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి సినీ గ్లామర్ తోడవ్వడంతో ఈ సారి పోటీ గట్టిగానే ఉంటుందని ఫిక్స్ అయ్యారు టీడీపీ, వైసీపీ నేతలు.

ఆ వార్తను మరచిపోక ముందే మరో కొత్త పార్టీ పోటీకి దిగనుందన్నా న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ కొత్త పార్టీ పెట్టేదెవరో కాదు..అప్పట్లో రాజకీయ చరిత్రలోనే కొత్త అధ్యానం సృష్టించిన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్. అవును..వినడానికి కాస్త షాకింగ్ గానే ఉన్నా, ప్రస్తుతానికి ఇదే హాట్ టాపిక్. యంగ్ టైగర్ కి పొలిటికల్ లీడర్ కొడాలి నాని ఆప్త మిత్రుడని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయనే వెనకుండి తారక్ చేత కొత్త పార్టీ పెట్టించే దిశగా వ్యూహ రచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

గతంలో టీడీపీ తరుఫన ప్రచారం చెయ్యడం, అంతకు మించి తాత పోలికలు పిణికిపుచ్చుకోవడంతో పాటు, ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకువడానికే తారక్ చేత కొత్త పార్టీ పెట్టాలనే ప్లాన్ కొడాలికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే దాదాపు 50 మంది నాయకులను లిస్టులో పెట్టారని, వారు కాకుండా టీడీపీ, వైసీపీ నుంచి కూడా మరి కొందరు ఇటు జంపయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. రీసెంట్ గా పవన్ కూడా పోటీకి దిగుతున్నాడనే బాధ నుంచి బయటకి రాకముందే, ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త పార్టీ విషయం నేతల్లో కలవరపాటుకు గురి చేస్తోంది.ఒకవేళా ఇదే గనుక నిజమైతే..వచ్చే ఎన్నికల్లో అసలైన మజా ఉంటుందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ విసురుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..

 

Loading...

Leave a Reply

*