గుడివాడ‌లో కొడాలి నానికి షాక్‌

kodali-nani

కృష్ణా జిల్లాలో టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ జోరుగా కొన‌సాగుతోంది. వైసీపీ, కాంగ్రెస్‌లోని నేత‌లంతా అధికార పార్టీవైపే అడుగులు వేస్తున్నారు. మొన్న‌టికి మొన్న కాంగ్రెస్‌లో కీల‌కంగా ఉన్న దేవినేని నెహ్రు కుటుంబం సైకిలెక్కింది. నిన్న‌టికి నిన్న పెడ‌నలోని వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు జ‌గ‌న్‌కు షాకిచ్చి… బాబుకు షేక్ హ్యాండిచ్చారు. ఇప్పుడు తాజాగా గుడివాడ‌కు చెందిన మునిసిప‌ల్ చైర్మ‌న్ య‌ల‌వ‌ర్తి శ్రీ‌నివాస‌రావు ప‌సుపు కండువా క‌ప్పుకొన్నారు. అక్క‌డి ఎమ్మెల్యే కొడాలి నానికీ చెయ్యిచ్చి… సైకిల్ ఎక్కి టీడీపీ కార్యాల‌యానికి వెళ్లిపోయారు. పోతూ పోతూ ప‌దిమంది వైసీపీ కౌన్సిల‌ర్‌ల‌ను కూడా వెంట తీసుకుపోయారు.

క్యాంపు కార్యాలయానికి వ‌చ్చిన‌ శ్రీ‌నివాస‌రావు, ఆయ‌న కౌన్సిల‌ర్‌లకు టీడీపీ నేత‌లు సాద‌ర ఆహ్వానం ప‌లికారు. చంద్ర‌బాబు కూడా స్వ‌యంగా వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొడాలి నాని అభ్యంత‌ర‌క‌ర భాష‌, ప‌ద్ధ‌తి న‌చ్చ‌కే తాము పార్టీ వీడుతున్నామ‌ని ఈ నేత‌లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. వీరి చేరిక‌తో గుడివాడ మునిసిపాలిటీ టీడీపీ వ‌శం అయ్యింది. ఇప్ప‌టికే టీడీపీకి ఇక్క‌డ 15 మంది కౌన్సిల‌ర్‌లు ఉన్నారు. చైర్మ‌న్‌తో స‌హా 11 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి రావ‌డంతో ఆ పార్టీ బ‌లం 26కు చేరుకుంది. వైసీపీ బ‌లం 10కి ప‌డిపోయింది.

జ‌గ‌న్ స‌హా వైసీపీలోని నేత‌ల తీరు న‌చ్చ‌కే ఆ పార్టీలోని నేత‌లంతా టీడీపీలో చేరుతున్నార‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి దేవినేని నెహ్రు వ్యాఖ్యానించారు. మ‌రో ముగ్గురు కీల‌క నేత‌లు త‌మ‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని త్వ‌ర‌లో జిల్లాలో వైసీపీ దుకాణం బంద్ అయిన‌ట్లేన‌ని దేవినేని అన్నారు.

Loading...

Leave a Reply

*