మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్ రెడ్డికి మ‌ళ్లీ పెళ్లి…. ముహూర్తం ఫిక్స్‌…!

kiran-kumar-reddy

మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్ రెడ్డి మరోసారి వార్త‌ల్లో హెడ్‌లైన్‌గా మారారు. గ‌త కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డి.. ఈ సారి ఓ స్పెష‌ల్ న్యూస్‌తో ప్ర‌జ‌ల‌ని ప‌లుక‌రించారు. గత ఎన్నిక‌ల‌లో స‌మైక్యాంధ్ర చాంపియ‌న్‌ని తానేన‌ని.. లాస్ట్ బాల్ వ‌ర‌కు క్రీజ్‌లో బ్యాటింగ్ చేస్తాన‌ని చెప్పి.. లాస్ట్ మినిట్‌లో చేతులెత్తేసిన ఈ బ్యాట్స్‌మెన్‌.. ఈసారి పెళ్లి అంటూ న్యూస్‌లోకి వ‌చ్చారు. 2014 ఎన్నిక‌ల‌లో స‌మైక్యాంధ్ర పార్టీ పేరుతో ఓ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి హ‌డావిడి చేసిన ఆయ‌న స‌డెన్‌గా సైలెంట్ అయ్యారు. రాజ‌కీయంగా అస్త్ర‌స‌న్యాసం చేసిన‌ట్లు క‌నుమ‌రుగయ్యారు.

రెండున్న‌రేళ్లుగా సైలెంట్‌గా ఉన్న కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌ళ్లీ యాక్టివ్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌కు మ‌ళ్లీ బ్యాట్‌, ప్యాడ్‌తో రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన చిత్తూరు జిల్లా పీలేరులో చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. ఇప్ప‌టికే పొలిటిక‌ల్‌గా సర్వం సిద్ధం చేసుకున్న‌ట్లు, త్వ‌ర‌లోనే దానిపై ఓ ప్ర‌క‌ట‌న చెయ్య‌డానికి టైమ్ తీసుకుంటున్న‌ట్లు అర్ధం అవుతోంది.

కిర‌ణ్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం గుర్రంకొండ మండ‌లంలో ప‌ర్య‌టిస్తున్న‌ప్పుడు, అనుచ‌రులు కొంద‌రు రాజ‌కీయంగా త‌మ‌కు దారి చూపించాల‌ని చెప్పారు. దీనిపై స్పందించిన ఆయ‌న ఇప్పటికే పెళ్లి కుదిరింద‌ని… పెళ్లి కూతురు ఎవరన్నది మాత్రం ప్ర‌స్తుతానికి రహస్యమ‌ని… త్వరలోనే తాళిబొట్టు కట్టే ముహూర్తం తేలగానే అంద‌రికీ స్వ‌యంగా చెపుతాన‌ని, శుభలేఖలు అందరికీ వస్తాయ‌నీ చెప్పారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద సంచ‌ల‌నంగా మారాయి.

కిర‌ణ్ కుమార్‌రెడ్డి పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై గ‌త కొంత‌కాలంగా ర‌క‌ర‌కాల ఊహాగానాలు న‌డుస్తున్నాయి. బీజేపీ తీర్ధం పుచ్చుకుంటార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. కొంద‌రు వైఎస్సార్‌సీ బాట ప‌ట్ట‌బోతున్నార‌ని గాసిప్‌లు సృష్టించారు. మ‌రికొంద‌ర‌యితే, చంద్ర‌బాబు బ‌ద్ధ‌శ‌త్రువు అయినా.. రాజ‌కీయ ఉనికి కోసం టీడీపీ పంచ‌న చేరబోతున్నార‌నే రూమ‌ర్ కూడా క్రియేట్ చేశారు. ఇటీవ‌ల ఆయ‌న కాంగ్రెస్ గూటికి తిరిగి చేర‌తార‌నే ప్ర‌చారాన్ని తెర‌ముందుకు తెచ్చారు. వీటిలో ఆయ‌న నిర్ణ‌యం ఎటువైపో త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*