ముహూర్తం ఫిక్స్.. జ‌గ‌న్ టీమ్‌లోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి..!

kiran-kumar-reddy

పెళ్లి కూతుర్ని చూశాం.. పెళ్లికి తొంద‌రెందుకు..? ఇవీ అవిభాజిత ఏపీకి చిట్ట‌చివ‌రి ముఖ్య‌మంత్రి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు. దీంతో, ఆయ‌న ఏ పార్టీలో చేర‌తార‌నే హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీకి వెళ‌తారా? లేక కాంగ్రెస్‌ని ఎంచుకుంటారా? అనేది రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు సైతం ప‌జిల్‌గా మారింది. ఇటు ఏపీలో అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబుతోనూ, అటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్‌తోనూ కిర‌ణ్ కుమార్ రెడ్డికి విబేధాలు ఉన్నాయి. ఇద్ద‌రితోనూ ఆయ‌నకు రాజ‌కీయ‌ప‌ర‌మైన శ‌తృత్వం ఉంది. దీంతో, ఈ రెండు పార్టీల‌కు దూరంగా ఉంటార‌ని ప్ర‌చారం సాగింది.

కానీ, రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నే సామెత ఉంది. దీంతో, కిర‌ణ్ కుమార్ రెడ్డి టీడీపీ కంటే వైఎస్సార్‌సీవైపీకే మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. చంద్ర‌బాబుతో మొద‌టినుంచి కిర‌ణ్‌కు, ఆయ‌న తండ్రికి రాజ‌కీయ వైరుధ్యాలు ఉన్నాయి. ఇటు, జ‌గ‌న్‌తో ఆయన‌కు వైఎస్ బ‌తికున్న కాలంలో స‌ఖ్య‌త ఉంది. మ‌రోవైపు, జ‌గ‌న్‌.. ఇప్పుడు రాజ‌కీయంగా స‌రైన నేత‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న త‌న సేవ‌లు వైఎస్సార్‌సీకే ఎక్కువ అవ‌సరం అని భావిస్తున్నార‌ట‌. అందుకే, గ‌తంలోని వైరుధ్యాల‌ను ప‌క్క‌న‌పెట్టి జ‌గ‌న్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం.

రాజకీయంగా జ‌గ‌న్ త‌న‌కంటే జూనియ‌ర్ అయినా.. ప్ర‌స్తుతం ఉన్న త‌రుణంలో ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌పై ప్రాధాన్య‌త చూపాల‌ని అందుకే, త‌న‌కు రాజ్య‌స‌భ ప‌ద‌వి ఇస్తే జ‌గ‌న్‌కి మ‌ద్ద‌తు ప‌లుకుతాన‌ని కండిష‌న్ ఇచ్చార‌ట‌. దానికి జ‌గ‌న్ ఓకే అన‌డంతో వైఎస్సార్‌సీ తీర్ధం పుచ్చుకోవ‌డానికి రెడీ అయ్యాడ‌ని తెలుస్తోంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడ‌ని, ఈ నెల 23న వైఎస్సార్‌సీ కండువా క‌ప్పుకోనున్నాడ‌ని స‌మాచారం. ఇందులో నిజ‌మెంత అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*