కేసీఆర్‌కి వార్నింగ్‌ ఇచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే..!

kcr

తెలంగాణ సీఎం కేసీఆర్…. టీఆర్ఎస్‌కు అధ్య‌క్షుడు కూడా అయిన ఆయ‌న ఎవ‌రినీ లెక్క చేయ‌డు… మాట‌ల మ‌రాఠీ అయిన కేసీఆర్ అంద‌రిపై తూటాల వర్షం కురిపిస్తాడు…. ప‌క్క రాష్ట్రం సీఎం అయినా ఇండియా పీఎం అయినా ఆయ‌న‌కు ఒక్క‌టే… ఎవ‌రికైనా వార్నింగ్ ఇచ్చెయ్య గ‌ల‌డు…. డోన్ట్‌కేర్ అనే ఆయ‌న ఎవ‌రినీ కేర్ చేయ‌డు… ఎవ‌రిని లెక్క చేయ‌ని కేసీఆర్‌కి సొంత పార్టీలోనే ఎదురుదెబ్బ త‌గిలింది.. అంద‌రికి వార్నింగ్ ఇచ్చే కేసీఆర్‌కి ఆయ‌న సొంత పార్టీ ఎమ్మెల్యేనే వార్నింగ్ ఇచ్చాడు… తెలంగాణ‌లో కొత్త జిల్లాల కోసం కొట్టుకుంటున్న‌వేళ ఆ నేత కేసీఆర్‌కి వ్య‌తిరేకంగా గొంతు విప్పాడు… తాను కోరిన జిల్లా ఇవ్వ‌క‌పోతే ఝ‌ల‌క్ ఇస్తానంటూ కేసీఆర్‌ని బెదిరించాడు….

ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా అయినా చేస్తానుగానీ రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేదంటూ తేల్చిచెప్పాడు… వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటుచేయాల‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజీవ‌రావు డిమాండ్ చేశారు…. వికారాబాద్ జిల్లాను ఏర్పాటుచేయ‌క‌పోతే తాను త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ ఆయ‌న సీఎం కేసీఆర్‌నే హెచ్చరించారు… గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వికారాబాద్‌ను జిల్లాగా మారుస్తాన‌ని కేసీఆర్ అప్ప‌ట్లో హామీ ఇచ్చార‌ని సంజీవ‌రావు గుర్తు చేశారు…19మండ‌లాల‌తో కూడిన వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాల్సిందేన‌ని సంజీవ‌రావు ప‌ట్టుప‌డుతున్నారు…

ఈ విష‌యంలో  కేసీఆర్ వెన‌క్కి త‌గ్గ‌కూడ‌ద‌న్నారు సంజీవ‌రావు… జిల్లాను అడ్డుకునేందుకు కొంద‌రు కృత్రిమ ఉద్య‌మాలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు… జిల్లా గెజిట్ 28వ తేదీలోగా వ‌స్తుందని, అలా రాకుంటే తాను రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు… ఇప్ప‌టిదాకా టీఆర్ఎస్‌లో ఎంత అసంతృప్తి ఉన్నా బ‌య‌ట‌ప‌డ‌లేదు…. ఇప్పుడు ఒక్క‌డు గొంతు విప్పాడు.. రేపు ఇంకెంత‌మంది నిర‌స‌న స్వ‌రం వినిపిస్తారో అని గులాబీ ద‌ళ‌ప‌తి క‌ల‌వర‌ప‌డుతున్నాడు.

Loading...

Leave a Reply

*