ఫాంహౌస్‌లో ప‌డుకునే తుగ్ల‌క్ కేసీఆర్‌

kcr

విప‌క్షాల‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాలంటూ కాంగ్రెస్ నేత‌ల‌పై సీఎం చేసిన విమ‌ర్శ‌ల‌పై ఉత్త‌మ్ కుమార్‌, భ‌ట్టి విక్ర‌మార్క త‌దిత‌రులు ఘాటుగా బ‌దులిచ్చారు. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉండి క‌నీస సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారంటూ కేసీఆర్‌పై ఉత్త‌మ్ స్పందించారు. తుగ్ల‌క్ మాదిరి, పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్ పాల‌న సాగుతోంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల సొమ్మును ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల‌కు దోచిపెడుతూ సీఎం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నార‌ని ఆరోపించారు. వాట‌ర్ గ్రిడ్‌కు నిదులు ఉన్న‌య‌ని చెబుతున్న సీఎం… రుణ‌మాఫి, ఫీసు రీయింబ‌ర్స్‌మెంట్‌కు డబ్బులు లేవా అని నిల‌దీశారు.

పంట‌లు కోల్పోయి రైతులు క‌ష్టాల్లో ఉంటే… కేసీఆర్ మాత్రం రైతులు సంబ‌రాలు చేసుకుంటున్న‌ట్లు మాట్లాడుతున్నార‌ని ఉత్త‌మ్ విమ‌ర్శంచారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ నివేదిక‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని ఉత్త‌మ్ డిమాండ్ చేశారు. 40 ల‌క్ష‌ల‌తో ఒక జిల్లా.. నాలుగు ల‌క్ష‌ల‌తో ఒక జిల్లా ఇదేం శాస్ర్తీయ‌త అని కేసీఆర్‌ను ఉత్త‌మ్ నిల‌దీశారు. సీఎం ఫాంహౌస్‌లో ప‌డుకుని నిద్ర‌పోతూ సోయి లేకుండా మాట్లాడుతున్నార‌ని, కాంగ్రెస్‌కు సోయి ఉంది కాబ‌ట్టే తెలంగాణ ఇచ్చింద‌ని మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మండిప‌డ్డారు.

Loading...

Leave a Reply

*