టీడీపీ మంత్రిపై కేసీఆర్‌కు ఎందుకంత సృజ‌న!

kcr-shows-special-interest-on-tdp-minister

తెలంగాణ‌లో టీడీపీ అనే మాట విన‌ప‌డ‌కూడ‌ద‌న్న‌ది ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌. అందుకే అధికారంలోకి రాగానే ఆయ‌న టీడీపీని కోలుకోలేని దెబ్బ‌కొట్టారు. బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న టీడీపీని దెబ్బ‌కొట్ట‌కుంటే భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భ‌య‌ప‌డిన కేసీఆర్ ముందుగా ఆ పార్టీని చీల్చి చెండాడారు. ఆ త‌ర్వాత కూడా టీడీపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. ఇక‌, రేవంత్‌ను కేసుల్లో ఇరికించి చంద్ర‌బాబు ఫోన్ ట్యాపింగ్‌లు చేయించి ఇక్క‌డి నుంచి వెళ్ల‌గొట్టార‌న్న ప్ర‌చార‌మూ ఉండ‌నే ఉంది. అయితే, అంద‌రూ ఒకెత్తు ఆయ‌న త‌క్క అన్న‌ట్లు టీడీపీలోని ఓ కుబేరుడైన కేంద్ర‌మంత్రి ప‌ట్ల మాత్రం కేసీఆర్ త‌న స‌హృద‌య‌త ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ట‌.

ఆ మంత్రికి చెందిన వ్యాపార సంస్థ‌లు, మాల్స్‌ను కంటికి రెప్ప‌లా కాపాడుతున్నార‌ట‌. ఇది ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్నా… ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు అంశంలో మ‌ళ్లీ బ‌హిర్గ‌త‌మైంది. ఆక్ర‌మ‌ణ‌ల విష‌యంలో ఎవ‌రినీ వదిలేది లేదని ప్ర‌క‌టించిన కేసీఆర్ ఈ మంత్రిగారి మాల్ విష‌యంలో మాత్రం ఉదార‌త ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ట‌. రోడ్డుపైకి ఇది చొచ్చుకొచ్చినా… అక్క‌డి రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతున్నా… సీఎం మాత్రం లైట్ తీసుకున్నార‌ట‌. పైగా ఆక్ర‌మ‌ణ‌దారు సంగ‌తి తేల్చాల్సింది పోయి ఆ రోడ్డులో ఫ్లైఓవ‌ర్ క‌ట్టి ట్రాఫిక్ ఇబ్బందులు తీరుస్తామని ప్ర‌క‌టించార‌ట‌. అంటే మంత్రిగారి ఆక్ర‌మ‌ణ‌ల ఫ‌లితంగా ఏర్ప‌డిన ఇబ్బందుల‌కు ప్ర‌జా ధ‌నం వెచ్చించి ఫ్లై ఓవ‌ర్ క‌డ‌తార‌న్న‌మాట‌. ఏమైనా ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్ అన్నారు క‌దా.

Loading...

Leave a Reply

*