నన్ను క్ష‌మించండి కేసీఆర్‌

kcr-1

రాష్ట్రంలో కోరిన ప్ర‌జ‌లంద‌రికీ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామ‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌ధాన హామీ. కానీ ఇప్పుడు అదే డ‌బుల్ బెడ్‌రూంలు క‌ట్టించ‌లేనంటూ కేసీఆర్ సారీ చెప్పారు. డ‌బుల్ బెడ్‌రూం పొందే అర్హ‌త మీకు లేదంటూ మిడ్‌మానేరు నిర్వాసితుల‌కు తేల్చి చెప్పారు. అయితే, వారికి నిర్మించిన కాల‌నీల్లో అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తాన‌ని మాటిచ్చారు. భూములు ఇచ్చిన దానికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ప‌రిహారం పొందినందున మిడ్‌మానేరు నిర్వాసితుల‌కు డ‌బుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని, అందుకే మీరు కోరిన‌ట్లు చేయ‌లేకపోతున్నందుకు క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాన‌ని కేసీఆర్ బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు.

ఆ రోజు అవ‌గాహ‌న లేకుండా హామీ ఇచ్చాన‌ని ఇప్పుడు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆ హామీ నెర‌వేర్చ‌లేక‌పోతున్నాన‌ని త‌న త‌ప్పును అంగీక‌రించారు. ఈ విష‌యంలో త‌న‌ను పెద్ద‌మ‌న‌సుతో క్ష‌మించాల‌ని నిర్వాసితుల‌ను కోరారు. ఇక‌, కేసీఆర్ ఎప్పుడు దొరుకుతారా అని కాచుక్కూర్చున్న విప‌క్షాల‌కు ఇప్పుడు ఆయ‌నే ఆయుధ‌మిచ్చిన‌ట్లైంది. అవ‌గాహ‌న లేక ఆ రోజు హామీ ఇచ్చానంటూ ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు విప‌క్షాలు ఎలా స్పందిస్తాయో మ‌రి.

Loading...

Leave a Reply

*