కేసీఆర్ త‌ప్పు దిద్దుకున్నారు!

kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌పై విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు బ‌దులిచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు సంద‌ర్భంగా గ‌తంలో చేసిన పొర‌పాటును స‌రిదిద్దుకున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల నియామ‌కాల‌లో మ‌హిళ‌ల‌కు అగ్ర‌తాంబూలం ఇచ్చి త‌న‌పై వస్తున్న విమ‌ర్శ‌ల‌కు బ‌దులిచ్చారు .తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత తొలి కేబినెట్‌లో ఒక్క మ‌హిళ‌కు కూడా స్థానం క‌ల్పించ‌లేదంటూ కేసీఆర్‌పై మ‌హిళా సంఘాలు, విప‌క్ష నేత‌లు ధ్వ‌జమెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. రెండున్న‌రేళ్లు గ‌డిచినా ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్ ఆ విమ‌ర్శ‌ల‌పై స్పందించ‌లేదు. మ‌హిళా నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఎందుకు ఇవ్వ‌లేదో చెప్ప‌నేలేదు. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు సంద‌ర్భంగా వ‌చ్చిన చాన్స్‌ను ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు ఉప‌యోగించుకున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, జేసీల నియామ‌కాల‌లో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశారు. కొత్త‌గా ఏర్ప‌డిన 21 జిల్లాల‌లో తొమ్మిది జిల్లాల‌కు మ‌హిళ‌ల‌నే క‌లెక్ట‌ర్లుగా నియ‌మించారు. ఆరుగురిని ఎస్పీలుగా, మ‌రో ముగ్గురిని జాయింట్ క‌లెక్ట‌ర్లుగా నియ‌మించారు. రాష్ట్ర అధికార యంత్రాంగంలో మ‌హిళ‌ల సేవ‌ల‌ను ఎక్కువ‌గా వినియోగించుకోవాల‌నుకున్న కేసీఆర్ వారికి అ గ్ర‌తాంబూలం ఇచ్చారు. త‌ద్వారా మంత్రివ‌ర్గంలో మ‌హిళలే లేరంటూ వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు కూడా చెక్ పెట్టారు .

Loading...

Leave a Reply

*