ఏపీ దారికొస్తున్న కేసీఆర్!

kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ దిగొస్తున్నారు. విభ‌జ‌న వివాదాల‌పై ఏపీని ముప్పుతిప్ప‌లు పెట్టాల‌నుకున్న‌ కేసీఆర్ ఇప్పుడు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం చొర‌వ చూపుతున్నారు. వివిధ అంశాల‌లో హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప‌డుతున్న మొట్టికాయ‌ల ప్ర‌భావ‌మో… ఇదే వైఖ‌రితో ముందుకెళ్తే న‌ష్టం త‌ప్ప‌ద‌ని భావించారో కానీ కేసీఆర్ దారి మార్చుకున్నారు. ఉన్న‌త విద్యామండ‌లి వ్య‌వ‌హారంలో ఏపీతో తెగేదాకా లాగిన కేసీఆర్‌కు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వ‌ర‌కూ అక్షింత‌లు త‌ప్ప‌లేదు. త‌మ‌కు రావాల్సిన న్యాయ‌బ‌ద్ధ‌మైన వాటి విష‌యంలో కూడా తెలంగాణ ప్ర‌భుత్వం అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఈ విష‌యంలో న్యాయం చేయాల‌ని ఏపీ సుప్రీం కోర్టు వ‌ర‌కూ వెళ్లి పోరాడింది.

సుప్రం కోర్టు కూడా ఉన్న‌త విద్యామండ‌లి వ్య‌వ‌హారంలో తెలంగాణ వైఖ‌రిని త‌ప్పుబడుతూ ఏపీకి అండ‌గా నిలిచింది. త‌క్ష‌ణం ఆస్తులు, అప్పుల‌ను పంచుకోవాల‌ని తీర్పు చెప్పింది. దానికి కూడా తెలంగాణ స‌ర్కారు స‌సేమిరా అంది. మ‌ళ్లీ అదే సుప్రీం కోర్టులో రివిజ‌న్ పిటిష‌న్ వేసింది. ఆ పిటిష‌న్‌ను స్వీక‌రించేందుకే సుప్రీం అంగీక‌రించ‌లేదు. ఇక మీరు చెప్పుకునేది ఏమీ లేద‌ని గ‌తంలో ఇచ్చిన ఆదేశాల‌ను అమ‌లు చేయాల్సిదేన‌ని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప‌దిలోని సంస్థ‌ల వ్య‌వ‌హారం తేల్చాల్సిందిగా, త‌మ వాటా త‌మ‌కు ఇవ్వాల్సిందిగా కొన్నాళ్ల నుంచి ఏపీ చేస్తున్న విజ్ఞ‌ప్తుల‌ను తెలంగాణ సీఎం ప‌ట్టించుకోలేదు.

సుప్రీం కోర్టు తీర్పు త‌ర్వాత ఏపీ వేగం పెంచింది. దాంతో కేసీఆర్ కూడా దిగొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఢి్ల్లీలో హోంమంత్రి రాజ్‌నాథ్‌ను క‌లిసిన కేసీఆర్ త‌క్ష‌ణం షెడ్యూల్ ప‌దిలోని సంస్థ‌ల విభ‌జ‌న‌ను పూర్తి చేయాల‌ని కోరారు. తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి ఇలాంటి విజ్ఞ‌ప్తి రావ‌డం ఇదే తొలిసారి. ఐఏఎస్ అదికారుల‌ను అడ్డుకుని వారిని అరెస్టులు చేయించి, ఉమ్మ‌డి ఖాతాల్లో నిధుల‌ను స్తంభింప‌చేయించి ఇలా ప్ర‌తి విష‌యంలోనూ అడ్డంకులు క‌ల్పించిన తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్పుడు ఉమ్మ‌డి సంస్థ‌ల సంగ‌తి తేల్చ‌మంటూ కేంద్ర హోంశాఖ మంత్రిని క‌లిసి కోర‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Loading...

Leave a Reply

*