దొంగ స‌ర్వేల కేసీఆర్‌

kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని బీజేపీ విమ‌ర్శిస్తోంది. తెలంగాణ‌లోని అసెంబ్లీ స్థానాల‌న్నింటిలో త‌మ‌దే గెలుప‌ని స‌ర్వేలు చెబుతున్నాయంటూ సీఎం చెబుతున్న మాట‌లు అవాస్త‌మ‌ని ఆ పార్టీ మండిప‌డింది. దొంగ స‌ర్వేలు చేసుకుంటూ… సీఎం త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ధ్వ‌జ‌మెత్తారు. 119 అసెంబ్లీ సీట్లలో వంద గెలుస్తామంటూ కేసీఆర్‌ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఫిరాయించి గులాబి కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలు నిర్వహిస్తే కేసీఆర్ అస‌లు రంగు ఏమిటో బయట పడుతుందని ల‌క్ష్మణ్ స‌వాలు విసిరారు. త్వ‌ర‌లోనే టీఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి త‌గిన గుణ‌పాఠం చెప్ప‌డానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయ‌న అన్నారు.

రైతు సమస్యలను పరిష్కరిం చడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని, రైతు సమస్యలపై తాము ఉద్య‌మం చేప‌డ‌తామ‌ని చెప్పారు. రాష్ట్రం లో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో మునిగింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కరువు గురించి మాట్లాడితే రాష్ట్రం పరువు పోతుందని భావించి టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం…. కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా రాకుండా చేసిందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయ‌న‌ ఆవేదన వ్యక్తం చేశారు. 231 కరువు మండలాలను గుర్తించిన కేంద్రం రూ.791 కోట్లను నిధులిస్తే వాటిని ఇప్ప‌టి వ‌ర‌కూ రైతులకు అందజేయలేదని ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు.

Loading...

Leave a Reply

*