విప‌క్షాల దెబ్బ‌కు కేసీఆర్ బెంబేలు!

kcr

తెలంగాణ‌లో ఇక అతా ఏక‌ప‌క్షం. మాదే అధికారం. మ‌మ్మ‌ల్ని కాద‌ని గెలిచే పార్టీ లేదు. ఏ నేత‌కు అంత ద‌మ్ముల్లేవు అనుకునే టీఆర్ఎస్ నేత‌లు ఇప్పుడిప్పుడే వాస్త‌వంలోకి వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌తిప‌క్షాలకు విష‌యం లేక‌, ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు దారులు మూసుకుపోవ‌డంతో అన‌వ‌స‌ర విష‌యాల‌తో నానా యాగీ చేస్తున్నార‌ని కేసీఆర్ స‌హా అధికార పార్టీ నేత‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ చెబుతూ వ‌చ్చారు. అయితే, ఇప్పుడ‌ది మేక‌పోతు గాంభీర్య‌మేన‌ని తేలిపోయింది. రాష్ట్ర ప్ర‌భుత్వంపై విప‌క్షాలు తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నా… ప్ర‌జ‌ల్లోకి వెళ్లి పోరాటాలు చేస్తున్నా మంత్రులు, అధికార పార్టీ నేత‌లు ఎందుకు నోరు విప్పి వారిని అడ్డుకోలేక‌పోతున్నార‌ని స్వ‌యంగా సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదేతీరుగా ప్ర‌తిప‌క్షాల‌ను వ‌దిలేస్తే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని సీఎంకు అర్ధ‌మైన‌ట్లే ఉంది. కేబినెట్ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ మంత్రుల వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం.

విప‌క్షాల విమ‌ర్శ‌లు, ఆందోళ‌న‌ల‌పై మంత్రులు స‌రిగా స్పందించ‌డం లేద‌ని, దాంతో విప‌క్షాలు చేస్తున్న ప్ర‌చార‌మే జ‌నంలోకి వెళ్తుంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో ప్ర‌తిప‌క్షాల‌ను విల‌విల్లాడేలా చేసిన కేసీఆర్ ఆ ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌ప‌డి కాంగ్రెస్ స‌హ విప‌క్ష పార్టీలు ప్ర‌జ‌ల్లోకి వెళ్తుండ‌డంతో కొంత ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. విప‌క్షాల‌ను ఇలాగే వ‌దిలేస్తే భ‌విష్య‌త్తులో మ‌రింత‌గా బ‌ల‌ప‌డ‌తాయ‌ని గ్ర‌హించిన కేసీఆర్ ముందుగానే మంత్రులు, ఇత‌ర నేత‌ల‌ను అల‌ర్ట్ చేస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*