కేటీఆర్ కోస‌మే అరుణ‌కి కేసీఆర్ వ‌రం!

ktr-and-dk-aruna

కొత్త జిల్లాల ఏర్పాటులో సీఎం కేసీఆర్ చూపుతున్న ఉదార‌త త‌న కుమారుడి కోస‌మేన‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన నాటి నుంచి సీఎంపై ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నాయి. కొడుక్కో జిల్లా, అల్లుడుకో జిల్లా అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా చేయాల‌ని కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కోరిన సంగ‌తి తెలిసిందే. అయితే, విప‌క్షాల విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో సిరిసిల్ల జిల్లా చేసే విష‌యాన్ని ప‌క్క‌న‌పెడుతున్న‌ట్లు ప్ర‌భ‌త్వం తెలిపింది. ఈ క్ర‌మంలోనే కేటీఆర్ కూడా తాను చేసిన డిమాండ్‌నే సీఎం ప‌ట్టించుకోలేద‌ని ప్ర‌చారం చేసుకున్నారు. అయితే, చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి సిరిసిల్లా కొత్త జిల్లాల జాబితాలో చేరిపోయింది. అది ఒక్క‌టే ఇస్తే ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తి పోస్తాయి కాబ‌ట్టి…

దానికి కాంగ్రెస్ నేత డీకే అరుణ చేస్తున్న గ‌ద్వాల జిల్లా పోరును కేసీఆర్ త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌ద్వాల జిల్లా చేసేది లేదంటూ టీఆర్ ఎస్ నేత‌లు ఢంకా భ‌జాయించి చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే, కేసీఆర్ మాత్రం గ‌ద్వాల జిల్లాగా ప్ర‌క‌టించేసి సిరిసిల్ల‌కు ప్ర‌తిప‌క్షాలు అడ్డుప‌డ‌కుండా వ్యూహాన్ని ప‌న్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్పుకొంటున్నారు. ప‌నిలోప‌నిగా జ‌నం అడుగుతున్న జ‌న‌గాంను కూడా జిల్లాగా చేసేసి కొత్త జిల్లాల సంఖ్య‌ను 21కి చేర్చారు సీఎం. మొత్తానికి ఏదేమైనా ముందునుంచి ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న‌ట్లు సీఎంకో జిల్లా, ఆయ‌న కుమారుడికో జిల్లా. అల్లుడికో జిల్లా నినాదం నిజ‌మైంది.

Loading...

Leave a Reply

*