రేవంత్ రెడ్డిపై కేసీఆర్ మ‌రో దెబ్బ‌!

revanth-reddy-and-kcr

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను అడ్డంగా బుక్ చేసిన కేసీఆర్ ఇప్పుడు రేవంత్‌కు మ‌రో మంట పెడుతున్నారు. ఇందుకు కొత్త జిల్లాల ఏర్పాటును ఆయుధంగా వాడుకోబోతున్నారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత బొటాబొటీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌కు టీడీపీ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా క‌నిపించింది. ఇక‌, టీడీపీ నేత రేవంత్ రెడ్డి కంటిలో న‌లుసులా మారారు. త‌న ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన అరోప‌ణ‌ల‌తో విమ‌ర్శ‌ల దాడి చేస్తున్న రేవంత్‌కు చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న కేసీఆర్ అత‌డిని అడ్డంగా బుక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు రేవంత్ ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అత‌డి అదుపులో లేకుండా చేయాల‌ని కేసీఆర్ ప‌థ‌కం ప‌న్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే జిల్లాల పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌ను ఆస‌రాగా చేసుకుని రేవంత్‌కు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టున్న కొడంగ‌ల్‌, బోంరాజ్‌పేట‌ రెండు మండ‌లాల‌ను ప‌క్క జిల్లాలోకి మార్చేలా ప్లాన్ చేశార‌ట. దాంతో రేవంత్‌కు రాజ‌కీయంగా చెక్ పెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.

ఈ రెండు మండ‌లాల్లోని బ‌లంతోనే రేవంత్ ఈజీగా గెలుస్తున్నార‌ని భావించిన కేసీఆర్ వాటిని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి విడ‌దీసి వికారాబాద్ జిల్లాలో క‌లిపేసేలా ప్ర‌తిపాద‌న‌లు రూపొందించారు. ఇలా ఒక్క రేవంతే కాదు… ప్ర‌తిప‌క్ష నేత‌లు స‌బితా ఇంద్రారెడ్డి, జైపాల్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి త‌దిత‌రు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే తీరుగా విడ‌దీసి బ‌ల‌హీనం చేసే సూత్రాన్ని కేసీఆర్ అమ‌లు చేస్తున్నార‌ట‌. కొత్త జిల్లాల ఏర్పాటులో కేసీఆర్ రాజ‌కీయ చాణక్యం చూసి ఆ పార్టీ నేత‌లు అచ్చెరువొందుతున్నార‌ట‌.

Loading...

Leave a Reply

*