కేసీఆర్ కొత్త జిల్లాలు పెట్టింది ఇందుకోస‌మా?

untitled-1415

ప‌ది జిల్లాల తెలంగాణ‌ను 31 జిల్లాలతో అతి పెద్ద రాష్ట్రంగా ఆవిర్భ‌వించింది. అయితే, సీఎం కేసీఆర్ కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నార‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. అయితే, విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను కేసీఆర్ తిప్పికొట్టారు. ఆషామాషీగా జిల్లాలు ఏర్పాటు చేయ‌ట్లేద‌ని అన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ‌గా మార్చాల‌న్న ధృడ సంక‌ల్పంతో తాము ప‌ని చేస్తున్నామ‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌జా స‌మ‌స్య‌లు త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్కారం అయ్యేందుకు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ద్వారా వెళ్లే ప్ర‌తి పైసా చివ‌రి ల‌బ్దిదారుకు వేగంగా చేరేందుకు చిన్న జిల్లాలు ఎంతో సౌల‌భ్యంగా ఉంటాయ‌ని కేసీఆర్ చెప్పారు.

2024 నాటికి రాష్ట్ర బ‌డ్జెట్ ఐదు ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుతుంద‌ని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నార‌ని కేసీఆర్ అన్నారు. ప్రతీ జిల్లాలో 2 లక్షల నుంచి మొదలుకొని 4 లక్షల వరకు జనాభా ఉండాలని అలాంట‌ప్పుడే అధికారులు ప‌ని చేయ‌డం సులువు అవుతుంద‌ని చెప్పారు. జిల్లాలోని ప్ర‌జ‌లంద‌రికి సంబంధించిన స‌మాచారం జిల్లా కలెక్టర్‌కు తెలుస్తుంద‌ని కేసీఆర్ అన్నారు. తద్వారా ప్రజా సమస్యలను సత్వరమే ప‌ర‌ష్కారానికి నోచుకుంటాయ‌ని చెప్పారు. పరిష్కరించవచ్చు.

Loading...

Leave a Reply

*