బాబు పేరు ప‌లిక‌డం కేసీఆర్‌కు ఇష్టం లేదా!

kcr-and-chandra-babu

ఏపీ సీఎం చంద్ర‌బాబు పేరు ప‌లికేందుకు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు లేదు. శుక్ర‌వారం కేబినెట్‌లో ఆయ‌న మాట్లాడిన తీరుతో ఇది స్ప‌ష్ట‌మైంది. రాష్ట్రాన్ని ప‌రిపాలించిన నేత‌లంద‌రి పేర్ల‌ను చెప్పిన కేసీఆర్… చంద్ర‌బాబు పేరును మాత్రం వ‌దిలేశారు. ప్ర‌స్తుత స‌చివాల‌యానికి భ‌యంక వాస్తు దోషం ఉంద‌ని అందుకే దానిలో ఉండి రాష్ట్రాన్ని ప‌రిపాలించిన వారెవ్వ‌రూ ఎద‌గ‌లేక‌పోయార‌ని కేసీఆర్ అన్నారు. ఈ సంద‌ర్భంగానే ఉమ్మ‌డి ఏపీని ప‌రిపాలించిన చాలామంది సీఎంల పేర్ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. హైద‌రాబాద్ రాష్ట్ర సీఎంగా ఉన్న బూర్గుల రామ‌కృష్ణారావు, ఉమ్మ‌డి ఏపీ సీఎంలు ఎన్టీఆర్‌, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, రోశ‌య్య‌ల‌కు ఈ స‌చివాల‌యం అచ్చిరాలేద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే, ఆ త‌ర్వాత సీఎం అయిన కిర‌ణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్న‌న్ని రోజులూ రాష్ట్రంలో ఎంత‌టి అల‌జ‌డి పూరిత వాతావ‌ర‌ణం ఉందో అంద‌రికీ తెలిసిందేన‌ని చెప్పారు.

ఈ క్ర‌మంలోనే తొమ్మిదేళ్లు ఇదే స‌చివాల‌యంలో ఉండి రాష్ట్రాన్ని ప‌రిపాలించిన చంద్ర‌బాబు పేరును మాత్రం కేసీఆర్ చెప్ప‌లేదు. చంద్ర‌బాబు కంటే ముందు సీఎంగా ఉన్న ఎన్టీఆర్ పేరు, బాబు త‌ర్వాత ఆ కుర్చీలో కూర్చున్న వైఎస్ పేరును ప్ర‌స్తావించిన కేసీఆర్‌… మ‌ధ్య‌లో తొమ్మిదేళ్లు సీఎం పీఠం అధిరోహించిన చంద్ర‌బాబు పేరును మాత్రం వ‌దిలేయ‌డం గ‌మ‌నార్హం. గ‌వ‌ర్న‌ర్ ఇచ్చే విందులో… కేంద్రం నిర్వ‌హించిన స‌మావేశంలో చంద్ర‌బాబుతో క‌ర‌చాల‌నం చేసే కేసీఆర్ ఆ త‌ర్వాత ఎప్పుడూ పెద్ద‌గా చంద్ర‌బాబు పేరును ప్ర‌స్తావించ‌లేద‌న్న విష‌యాన్ని తెలంగాణ నేత‌లు గుర్తు చేస్తున్నారు. ప‌క్క రాష్ట్ర సీఎం…

పోరుగు రాష్ట్ర నేత అంటూ సంబోధిస్తారు త‌ప్పించి చంద్ర‌బాబు పేరును ఆయ‌న చాలా చాలా అరుదుగానే త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే ఉచ్చ‌రిస్తార‌ని వారు పేర్కొంటున్నారు. చంద్ర‌బాబు త‌న మంత్రివ‌ర్గంలో స్థానం ఇవ్వ‌నందుకే బ‌య‌టికెళ్లి పార్టీ పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు సీఎం అయిన సంగ‌తి తెలిసిందే.

Loading...

Leave a Reply

*