బావ బుల్లెట్ అన్న క‌ల్వ‌కుంట్ల క‌విత‌!

kavitha1

త‌న మేన‌బావ హ‌రీశ్‌పై కేసీఆర్ కుమార్తె, ఎంపీ క‌విత ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న క‌విత జ‌గిత్యాల‌లోని వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ పాల‌క‌వ‌ర్గ ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యఅతిథిగా ఆమె ప్ర‌సంగించారు. త‌న ప్ర‌సంగంలో మార్కెటింగ్ శాఖ మంత్రి హ‌రీశ్‌రావును పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. హ‌రీశ్ ఆర‌డుగుల బుల్లెట్ అంటూ వ్యాఖ్యానించారు. ఆర‌డుగుల బుల్లెట్‌లా దూసుకెళ్తూ… మార్కెటింగ్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తున్నార‌ని ప్ర‌శంసించారు.

హ‌రీశ్ త‌న ప‌నితీరుతో మార్కెటింగ్ శాఖ‌ను అభివృద్ధిప‌థంలో ప‌య‌నింప‌జేస్తున్నార‌ని అన్నారు. రైతుల‌కు వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డులు దేవాల‌యాలేన‌ని ఆందుకే సీఎం కేసీఆర్ వాటిని బ‌లోపేతం చేస్తున్నార‌ని చెప్పారు. ఇక‌, అన్న‌దాత‌ల‌కు సౌక‌ర్యంగా ఉండేందుకు అన్ని మండ‌లాల్లో నూత‌నంగా గోడౌన్స్ నిర్మిస్తున్నార‌ని తెలిపారు. త‌న దృష్టిలో జఎమ్మెల్యే టీఆర్ ఎస్ నేత సంజ‌య్‌కుమారేన‌ని క‌విత చెప్పారు. కాగా, ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జీవ‌న్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన సంగ‌తి తెలిసిందే.

Loading...

Leave a Reply

*