క‌రుణ‌కు అస్వ‌స్థ‌త… పూర్తిగా ఇంటికే ప‌రిమితం!

karunanidhi

త‌మిళ‌నాడులో ప్ర‌తిప‌క్ష నేత డీఎంకే అధినేత క‌రుణానిధి అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు తెలిసింది. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నార‌న్న వార్త ఇప్పుడు రాష్ట్రంలో ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే, డీఎంకే వ‌ర్గాలు మాత్రం అదంతా ఒట్టిదేన‌ని క‌రుణ విశ్రాంతి తీసుకుంటున్నార‌ని పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిందేమి లేద‌ని ప్ర‌క‌టించాయి. క‌రుణానిధి రోజూవారి వేసుకునే మాత్ర‌లు కొన్ని విక‌టించ‌డంతో ఆయ‌న శ‌రీరం అల‌ర్జికి గురైంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దానివ‌ల్ల శ‌రీరంపైనా, చేతులుపైనా ద‌ద్దుర్లు వ‌చ్చాయ‌ని తెలిసింది. దాంతో వైద్యులు ఆయ‌న‌కు మందులు ఇచ్చార‌ని, అవి వాడుతూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించార‌ట‌.

దాంతో క‌రుణ కొన్నిరోజులుగా ఇంటి వ‌ద్ద‌నే ఉంటున్నారు. పార్టీ నేత‌ల‌ను కూడా పెద్ద‌గా క‌ల‌వ‌డం లేదు. దాంతో ఒక్క‌సారిగా క‌రుణ అనారోగ్యం బారిన ప‌డిన‌ట్లు త‌మిళ‌నాడు వ్యాప్తంగా వ‌దంతులు వ్యాపించాయి. వెంట‌నే స్పందించిన డీఎంకే నేత‌లు క‌రుణ ఆరోగ్యంగానే ఉన్నార‌ని చిన్న అల‌ర్జి కార‌ణంగా విశ్రాంతి తీసుకుంటున్నార‌ని ప్ర‌క‌టించారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నేమీ లేద‌ని ఎవ‌రూ క‌రుణ‌ను చూసేందుకు ఆయ‌న ఇంటి వ‌ద్ద‌కు రాన‌వ‌స‌రం లేద‌ని సూచించారు. ఇక‌, నెల రోజులుగా అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న జ‌య‌ల‌లితను ఈ దీపావ‌ళికి ఇంటికి పంప‌నున్న‌ట్లు వైద్యులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే.

Loading...

Leave a Reply

*