బాబు వ్యాఖ్య‌ల‌తో అల‌క‌.. జ‌గ‌న్ చెంత‌కు క‌ర‌ణం బ‌ల‌రాం..?

karanam-balaram

జ‌న చైత‌న్య యాత్రలో భాగంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ శ్రేణుల‌ను ఉద్దేశించి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొంద‌రు నేత‌లు ఓడిపోయినా.. ప‌ద్ద‌తి మార్చుకోవ‌డం లేద‌ని, త‌మ‌దే పైచేయి అన్నట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ ప‌ద్ద‌తి మార్చుకోక‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. అయితే, ఈ వ్యాఖ్య‌లు క‌ర‌ణం బ‌ల‌రామ్‌ని ఉద్దేశించి చేసిన‌వేన‌ని జిల్లా నేతలు భావిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల‌లో ఆయ‌న అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌త్య‌ర్ధి, వైఎస్సార్‌సీ నేత‌ గొట్టిపాటి ర‌వికుమార్ అలియాస్ బుజ్జిపై ఆయ‌న ప‌రాభ‌వం పొందారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌లో భాగంగా బుజ్జి టీడీపీ కండువా పుచ్చుకున్నారు. ఆయ‌న రాక‌ను క‌రణం బ‌ల‌రాం తీవ్రంగా వ్య‌తిరేకించారు. ర‌వికుమార్‌ని పార్టీలో చేర్చుకునేదే లేద‌ని తెగేసి చెప్పారు. కానీ, చంద్ర‌బాబు ఇద్ద‌రికీ న‌చ్చ‌చెప్పి.. ర‌వికుమార్‌కి పార్టీ తీర్ధం పోశారు. ర‌వికుమార్ టీడీపీలోకి వ‌చ్చినా.. అద్దంకి నియోజ‌కవ‌ర్గంతోపాటు, జిల్లాలోని మ‌రికొన్ని నియోజ‌క‌వర్గాల అంతర్గ‌త పార్టీ రాజ‌కీయాల‌లో ఆయ‌న జోక్యం ఎక్కువ‌యింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. చివ‌రికి పార్టీలోని కొంద‌రు నేత‌ల‌ను ఓడించ‌డానికి ఆయ‌న వైఎస్సార్‌సీతో చేతులు క‌లుపుతున్నార‌న్న టాక్ ఉంది. అందుకే, ఎంత చెప్పినా విన‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబు క‌రణం మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

బాబు వ్యాఖ్య‌ల‌తో జిల్లాలో క‌ర‌ణం హ‌వా మ‌రింత త‌గ్గుతుంద‌ని భావిస్తున్నారు. అందుకే, ఈ ప‌రిణామాన్ని ఊహించని క‌ర‌ణం బ‌ల‌రామ్‌.. త్వ‌ర‌లోనే పార్టీ నుంచి స‌ర్దుకోవ‌డానికి సన్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న వైఎస్సార్‌సీతో ట‌చ్‌లో ఉన్నార‌ని, ఏమాత్రం చిన్న తేడా వ‌చ్చినా జ‌గన చెంత‌కు చేర‌డం త‌థ్య‌మ‌ని రాజ‌కీయ‌విశ్లేష‌కులు అంటున్నారు. జిల్లాలో క‌ర‌ణంకు టీడీపీ నుంచి పోటీ చేసే స్థాన‌మే లేకుండా పోయింద‌ని… అదే ఆయ‌న అసలు క‌డుపు మంట అని విశ్లేషిస్తున్నారు. ఇందులో నిజ‌మెంతో అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది..

Loading...

Leave a Reply

*