నా వార‌సుడు అజిత్ – బ‌య‌ట‌ప‌డ్డ అమ్మ వీలునామా?

ajith

విప్ల‌వ నాయ‌కి, పుర‌చ్చి త‌లైవి అన్నింటికి మించి త‌మిళుల‌కు అమ్మ… అలాంటి జ‌య‌ల‌లిత ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు…. మూసిన క‌న్ను తెర‌వ‌ట్లేదు… పెద‌వి విప్ప‌ట్లేదు….అమ్మ అనారోగ్యంతో ఉంటే త‌మిళ‌నాడులో పాల‌న ప‌డ‌కేసింది… రాష్ట్రం మొత్తం స్తంభించిపోయింది… తాత్కాలిక సీఎం ప‌ద‌వి కోసం అనుచ‌ర‌గ‌ణం కొట్టుకుంటున్నారు… జ‌య‌ల‌లిత ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఎవ‌రిని త‌న వార‌సుడిగా ప్ర‌క‌టించ‌లేదు… దీంతో అమ్మ వారసుడు ఎవ‌రా అని త‌మిళ‌నాడు మొత్తం ఎదురుచూస్తోంది… అమ్మ‌కు వార‌సుడ్ని క‌నుగొనాల‌ని త‌మిళ‌తంబీలు త‌హ‌త‌హ‌లాడుతున్నారు… అయితే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత త‌న రాజ‌కీయ వార‌సుడ్ని ముందే ఎంపిక చేసుకున్నారా? వీలునామాలో ఆ విష‌యాన్ని పేర్కొన్నారా? ఇప్పుడు ఇవే పుకార్లు త‌మిళ‌నాడులో షికార్లు చేస్తున్నాయి…

జ‌య‌ను క‌న్న‌త‌ల్లిలా భావించే త‌మిళ్ బ‌డా స్టార్ అజిత్ కుమారే ఆమె వార‌సుడా… ఇప్పుడు ఈ విష‌యాల‌పై త‌మిళ‌నాడులో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కేవ‌లం సోష‌ల్ మీడియాలోనే కాకుండా న్యూస్ పేప‌ర్లు, న్యూస్ చానెళ్ల‌లో కూడా జో్రుగా ప్ర‌చారం హోరెత్తుతోంది… జ‌య వార‌సుడు అజిత్ కుమార్ అంటోంది త‌మిళ్ మీడియా. సినీ హీరోగా జ‌నంలో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్నాడు అజిత్ కుమార్‌…. అత‌డు వివాద‌ర‌హితుడు, సేవాత‌త్ప‌రుడే కాక సీఎం జ‌య‌ల‌లిత‌ను క‌న్న‌త‌ల్లిగా భావిస్తాడు…. గ‌తంలో ఇదే విష‌యాన్ని ప‌లు వేదిక‌ల‌పై బాహాటంగా చెప్పాడు కూడా. తాను అనారోగ్యంతో ఆస్ప‌త్రి పాలు కావడానికి చాలా రోజుల ముందే అజిత్‌ను ఇంటికి పిలిపించుకున్న జ‌య అత‌డితో అన్నాడీఎంకే పార్టీ వాస్త‌వ ప‌రిస్థితులు, భ‌విష్య‌త్ నిర్మాణం త‌దిత‌ర విష‌యాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

అన్ని విష‌యాలు ఆలోచించాకే అజిత్‌ను త‌న వార‌సుడిగా జ‌య ఎంపిక చేసుకున్నార‌ని, ఈమేర‌కు వీలునామా రాసి ఉంచార‌ని, ఆ వీలునామాను జ‌య‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తులైన వారి ద‌గ్గ‌ర దాచి ఉంచార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాక అజిత్ ఎంపిక అన్నాడీఎంకే పార్టీ పెద్ద‌లందరికి ఇష్టమే అని తెలుస్తోంది..గ‌తంలో రెండుసార్లు అమ్మ కోసం సీఎం ప‌ద‌వి చేప‌ట్టిన ప‌న్నీరుసెల్వం సీనియ‌ర్ అయినా అత‌డికి ప్ర‌జాదర‌ణ లేదు.. డీఎంకేను ఢీకొట్టే స‌త్తా లేదు. దీంతో అన్నాడీఎంకేలో కూడా చాలామంది అజిత్‌కే జై కొడుతున్నారు. రాబోయే రెండుమూడేళ్ల‌లో అజిత్‌ను స‌ర్వ‌స‌న్న‌ద్ధం చేసి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌ని స‌మాచారం.

Loading...

Leave a Reply

*