అమ్మ కోసం ఆధ్యాత్మిక బాట‌లో

untitled-15

త‌మిళ‌నాడులో ఆధ్యాత్మిక‌త వెల్లివిరుస్తోంది. ముఖ్యమంత్రి జ‌య‌లలిత త్వరగా కోలుకోవాల‌ని కోరుకుంటూ త‌మిళ జ‌న‌మంతా పూజ‌లు, పుణ్య కార్యాల్లో నిమ‌గ్నమ‌య్యారు. హోమాలు, య‌జ్ఞాలు చేస్తున్నారు. అన్నదానాలు, వ్రతాలు, నోములు నోస్తున్నారు. దాదాపు నెల రోజులుగా ఆస్పత్రికే ప‌రిమిత‌మైన జ‌య ఆరోగ్యంపై వైద్యులు ఏ రోజుకా రోజు బులెటిన్‌లు విడుద‌ల చేస్తున్నారు. ఆమెను కాపాడేందుకు తాము శాయ‌శ‌క్తులా ప్రయ‌త్నిస్తున్నామ‌ని చెబుతున్నారు. ఇక‌, ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యక‌ర్తలు చెన్నైలోని అపోలో ఆస్పత్రిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేశారు. మ‌రోవైపు తిరువ‌ళ్లూరులోని వీర‌రాఘ‌వ పెరుమాళ్ ఆల‌యంలో దాదాపు వంద‌మంది వైద్యులు ప్రత్యేక హోమాలు చేశారు.

రోగం వ‌స్తే బాగు చేసి ప్రాణాలు నిల‌పాల్సిన వైద్యులే అమ్మ ఆరోగ్యంగా ఉండాలంటూ య‌జ్ఞం చేయ‌డం ఆ ప్రాంతంలో ఆస‌క్తిని రేపింది. మృత్యుంజ‌య హోమం, మ‌హా సుద‌ర్శన య‌జ్ఞం, ధ‌న్వంత‌రీ హోమం, న‌ర‌సింహ హోమం నిర్వహించారు. ఉద‌యం ఏడు గంట‌ల‌కే మొద‌లైన ఈ హోమాలు రోజంతా కొన‌సాగాయి. ఈ కార్యక్రమానికి అన్నాడీఎంకే నేత‌లు, కార్యక‌ర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజ‌ర‌య్యారు. బ‌య‌టంతా వీళ్ల పూజ‌ల‌తో హోరెత్తుతుంటే ఆస్పత్రిలోప‌ల వైద్యులు మాత్రం జ‌య ఆరోగ్యాన్ని కాపాడేందుకు అహ‌ర్నిశ‌లూ శ్రమిస్తున్నారు. దేశ విదేశాల నుంచి వైద్యులు అపోలోకు క్యూ క‌డుతున్నారు. జ‌య‌ను క్షేమంగా బ‌య‌ట‌కు తెచ్చేందుకు తాము నేర్చుకున్న విద్యనంతా ధార‌పోస్తున్నారు.

Loading...

Leave a Reply

*