బీ ఫారంపై జ‌య వేలిముద్ర‌!

jayalalitha

త‌మిళ‌నాడు సీఎం ఆనారోగ్యంపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. నెల రోజులుగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న జ‌య‌ల‌లిత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. దీపావ‌ళికి ఇంటికి పంపాల‌ని వైద్యులు తొలుత భావించారు. త‌న‌ను దీపావ‌ళి కంటే ముందే ఇంటికి పంపాల్సిందిగా వైద్యుల‌ను జ‌య కోరార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే, వైద్యులు మాత్రం జ‌య ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షించి దీపావ‌ళికి పంప‌డం కుద‌ర‌ద‌ని, మ‌రో ప‌ది రోజులు ఆస్ప‌త్రిలోనే ఉండాల్సి ఉంటుంద‌ని సూచించారు. దాంతో దీపావ‌ళికి జ‌య ఇంటికి వెళ్లే అంశం వెన‌క్కి పోయింది. దీంతో ఆమె ఆస్ప‌త్రి నుంచే పాల‌న‌కు సంబంధించిన వ్య‌వ‌హారాలు చూస్తున్నారు. అలాగే, పార్టీకి సంబంధించిన విష‌య‌ల‌పై కూడా జ‌య ఆస్ప‌త్రి నుంచే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

తాజాగా రాష్ట్రంలో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న స్థానాల‌కు అన్నాడీఎంకే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. వారంద‌రికీ పార్టీ త‌ర‌ఫున బీ ఫారాల‌ను అంద‌జేసింది. ఆ ఫారాల‌పై పార్టీ అధినేత్రిగా జ‌య త‌న వేలిముద్ర‌ను వేసి స్టాంప్ వేశారు. ఇప్పుడీ బీ ఫారాల‌పై జ‌య వేలిముద్ర ఉన్న ఫొటోలు మీడియాలో హైలెట్ అవుతున్నాయి. మ‌రోవైపు జ‌య కోలుకోవాలంటూ చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రి వ‌ద్ద అమె అభిమానులు, కార్య‌క‌ర్తలు గ‌త నెల రోజులుగా పూజ‌లు, హోమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కూడా ఈ వ్ర‌తాలు, నోములు ఇంకా పెద్ద సంఖ్య‌లో కొన‌సాగుతూనే ఉన్నాయి.

Loading...

Leave a Reply

*