ఇంటికి వెళ్ల‌డానికి జ‌య రెడీ!

untitled-7

త‌మిళుల‌కు ఈ ఆదివారం ఎంతో ప్ర‌త్యేకం. కొన్నివారాలుగా నిద్రాహారాలు మాని వారు చేసిన పూజ‌లు ఫ‌లించిన రోజు. త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత పూర్తిగా కోలుకున్నార‌న్న వార్త వెలువ‌డిన‌ శుభ‌దినం. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రిలో చేరిన జ‌య ఇన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో యుద్ధం చేశారు. వైద్యుల కృషి… అభిమానుల దీవెన‌లు, ప్రార్థ‌న‌ల‌తో జ‌య చివ‌రికి అనారోగ్యంపై విజ‌యం సాధించారు. జ‌య పూర్తిగా కోలుకున్నార‌ని అపోలో ఆస్ప‌త్రి చైర్మ‌న్ ప్ర‌తాప్ సీ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇక ఎప్పుడంటే అప్పుడు ఆమెకిష్ట‌మైన రోజు ఇంటికి వెళ్ల వ‌చ్చ‌ని కూడా ప్ర‌క‌టించారు.

దాంతో త‌మిళ‌నాడంతా సంబ‌రాల వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌త్యేక వార్డులో వైద్యుల ప‌రిశీల‌న‌లో ఉన్న జ‌య‌… ప్ర‌స్తుతం త‌న‌కు ఇష్ట‌మైన ఆహారం తీసుకోగ‌లుగుతుంద‌ని, త‌న ప‌నులు తానే చేసుకోగ‌లుగుతుంద‌ని ప్ర‌తాప్ రెడ్డ వెల్ల‌డించారు. జ‌య ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించేందుకు లండ‌న్‌, సింగ‌పూర్‌, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వైద్య నిపుణుల‌ను ర‌ప్పించి చికిత్స అంద‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు జ‌య పూర్తిగా కోలుకోవ‌డంతో ఇవ్వాలో రేపో జ‌య ఇంటికి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*