ఆస్ప‌త్రి నుంచి జ‌య ఇంటికి

jaya

త‌మిళుల‌కు ఈ ఆదివారం వెరీ స్పెషల్‌. సీఎం జ‌య‌ల‌లిత అభిమానుల‌కు ఈ సండే డ‌బుల్ బొనాంజా. ఒకటి దీపావ‌ళి సంబరం. రెండేది జ‌య‌ల‌లిత ద‌ర్శ‌నం. గ‌త నెల రోజులుగా ఆస్ప‌త్రిలోనే చికిత్స పొందుతున్న జ‌య‌ల‌లిత ఆ రోజు ఇంటికి చేరుకోనున్నారు. ఈ విష‌యాన్ని వైద్యులు దాదాపుగా ధ్రువీక‌రించారు. వ‌చ్చే ఆదివారం రోజున అంటే స‌రిగ్గా దీపావ‌ళి వెలుగులు ప‌రుచుకునే వేళ‌లో అమ్మ‌ను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించాల‌ని వైద్యులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. గ‌తంలో జ‌య‌ల‌లిత కూడా త‌న‌ను దీపావ‌ళి నాటికి ఇంటికి పంపాల‌ని వైద్యుల‌ను కోరిన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు వైద్యుల నిర్ణ‌యంతో ఆమె కోరిక కూడా తీర‌బోతుంది.

సోమ‌వారం లండ‌న్ నుంచి, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వ‌చ్చిన వైద్యులు జ‌య‌ను ప‌రీక్షించిన సంగ‌తి తెలిసిందే. ఆ ప‌రీక్ష‌ల త‌ర్వాత‌నే వైద్యులు ఆమెను ఇంటికి పంపే విష‌య‌మై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. అమ్మ పూర్తిగా కోలుకుని ఇంటికి వ‌స్తుండ‌డంతో ఆమె అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త నెల రోజులుగా జ‌య కోలుకోవాలంటూ త‌మిళ జ‌నం తిండి తిప్ప‌లు మానేసి వ్ర‌తాలు, నోములు చేస్తూ.. మొక్కులు తీర్చుకుంంటున్న సంగ‌తి తెలిసిందే. చాలామంది ఇళ్ల‌కు కూడా వెళ్లకుండా అపోలో ఆస్ప‌త్రి వ‌ద్దే ప‌డిగాపులు ప‌డుతున్న సంగ‌తి విధిత‌మే. వీళ్లంద‌రి నీరిక్ష‌ణ వ‌చ్చే ఆదివారం తీరిపోనుంది. అమ్మ క్షేమంగా ఇంటికి రానుంది.

Loading...

Leave a Reply

*