అమ్మ ఆస్ప‌త్రిలో… మంత్రులు కేబినెట్‌లో

jaya-lalitha

తమిళ‌నాడులో విచిత్ర ప‌రిస్థితి. సీఎం జ‌య‌ల‌లిత గ‌త కొన్ని వారాలుగా ఆస్ప‌త్రికే ప‌రిమిత‌మ‌య్యారు. దాంతో ఆమె అభిమానులంతా చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రి ముందు ప‌డిగాపులు ప‌డుతున్నారు. పూజ‌లు చేస్తున్నారు. ఇక‌, రాష్ట్రంలో పాల‌నా సంక్షోభం రాకుండా గ‌వ‌ర్న‌ర్ ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మంత్రివ‌ర్గంలో జ‌య‌కు న‌మ్మ‌క‌స్తుడైన వ్య‌క్తికి ఆప‌ద్ధ‌ర్మ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌నుకున్నా ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డంతో ఆ యోచ‌న‌కు స్వ‌స్థి చెప్పారు. అదే స‌మ‌యంలో జ‌య విశ్వాస‌పాత్రుడైన స‌న్నీర్ సెల్వంకు జ‌య నిర్వ‌హిస్తున్న కీల‌క శాఖ‌ల‌ను అప్ప‌గించి పాల‌నాప‌ర‌మైన ఇబ్బందులు లేకుండా చూశారు. ఈ క్ర‌మంలోనే త‌మిళ‌నాడుకు కావేరీ జ‌లాల విష‌యం, దానిపై ప్ర‌తిప‌క్ష డీఎంకే ఆందోళ‌న‌లు నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి అప్ర‌దిష్ట రాకుండా చూసుకునేందుకు ప‌న్నీర్ సెల్వం రంగంలోకి దిగారు.

జ‌య ఆస్ప‌త్రిలో ఉన్నా ప్ర‌జ‌ల బాగోగులు చూసే విష‌యంలో ప్ర‌భుత్వం వెనుక‌బ‌డ‌లేద‌ని సంకేతాలివ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అలాగే, త‌మిళ‌నాడులోని మూడు అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల నోటిపికేష‌న్ విడుద‌లైంది. దానిపైనా ఏదోక నిర్ణ‌యం తీసుకోవాల్సిన ఆవ‌శ్యక‌త అన్నాడీఎంకే ప్ర‌భుత్వం పడింది. వీట‌న్నింటి నేప‌థ్యంలో అమ్మ లేకుండానే మంత్రివ‌ర్గం నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. సీఎం జ‌య లేకుండా జ‌రుగుతున్న తొలి కేబినెట్ బేటీ కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ కేబినెట్ స‌మావేశంలో ఏ నిర్ణ‌యాలు తీసుకుంటారోన‌న్న విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Loading...

Leave a Reply

*