అమ్మ ఆరోగ్యంగానే… వ‌దంతుల‌కు తెర‌!

amma

త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత ఆరోగ్యంపై ప్ర‌చారంలోకి వ‌చ్చిన వ‌దంతుల‌కు తెర ప‌డింది. గ‌త వారం రోజుల‌గా ఆస్ప‌త్రికే ప‌రిమిత‌మైన జ‌య‌ల‌లిత ఆరోగ్యంఐ ప‌లు వ‌దంతులు వ్యాప్తిలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. డీఎంకే అధినేత క‌రుణానిధి చేసిన ప్ర‌క‌ట‌న‌తో అవి మ‌రింత‌గా ఎక్కువ‌య్యాయి. ఇన్నిరోజులుగా ఆస్పత్రిలో ఉన్న జ‌య ఆరోగ్యంపై త‌మ‌కు అనుమానాలున్నాయ‌ని వాటిని వెంట‌నే బ‌య‌ట‌పెట్టాల‌ని, క‌నీసం ఆమె చికిత్స పొందుతున్న ఫొటోనైనా విడుద‌ల చేయాల‌ని క‌రుణానిధి డిమాండ్ చేశారు.

ఇక‌, మ‌రోవైపు జ‌య అభిమానుల్లో కూడా ఆమె ఆరోగ్యంపై ఆందోళ‌న‌లు ఎక్కువ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ఇంచార్జి గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు రంగంలోకి దిగారు. మ‌హారాష్ట్ర నుంచి త‌మిళ‌నాడు వ‌చ్చి ఆస్ప‌త్రికి వెళ్లి జ‌య‌ను ప‌రామ‌ర్శించి వ‌చ్చారు. ఆ త‌ర్వాత అధికార ప్ర‌క‌ట‌న చేశారు. జ‌య చికిత్స పొందుతున్న గ‌దికి తాను వెళ్లి చూశాన‌ని ఆమె వేగంగా కోలుకుంటున్నార‌ని ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని ప్ర‌క‌టించారు. దాంతోజ‌య ఆరోగ్యంపై వెల్లువెత్తుతున్న వ‌దంతుల‌కు చెక్ ప‌డింది.

Loading...

Leave a Reply

*