లాప్‌టాప్‌తో రాష్ట్రాన్ని న‌డుపుతున్న జ‌య‌!

jaya

నెల రోజులుగా ఆస్ప‌త్రిలోఉన్న త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత ఇప్పుడు పాల‌న‌పై దృష్టి సారించిన‌ట్లు తెలిసింది. మెల్లి మెల్లిగా మాట్లాడుతున్న జ‌య లాప్‌టాప్ ద్వారా అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు, ఆదేశాలు ఇస్తున్నార‌న్న‌ది తాజా స‌మాచారం. త‌న స‌న్నిహితురాలు శ‌శిక‌ళ‌, పాల‌నా వ్య‌వ‌హారాల‌ను ద‌గ్గ‌రుండి చూస్తున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిణికి అవ‌స‌ర‌మైన సూచ‌న‌లను జ‌య త‌న లాప్‌టాప్ ద్వారా ఇస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. జ‌య కోలుకుంటుండ‌డంతో దీపావ‌ళి రోజున ఆమెను డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు జ‌య మాత్రం ఇంకా ముందుగానే ఇంటికి వెళ్తాన‌ని వైద్యుల‌ను కోరుతున్న‌ట్లు తెలిసింది. అయితే, ఆమెను ప‌రీక్షిస్తున్న లండ‌న్ వైద్యుడు, అపోలో వైద్యులు మాత్రం మ‌రో ప‌ది రోజులు ఇక్క‌డే ఉండాల్సింది సూచించిన‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యాన్ని జ‌య‌కు న‌చ్చ‌చెబుతున్న‌ట్లు తెలిసింది. అలాగే, జ‌యను ఇంటికి పంపిన త‌ర్వాత ఆమె ఆరోగ్యాన్ని కాపాడేందుకు అత్య‌వ‌స‌ర‌మైతే వెంట‌నే వైద్య చికిత్స‌లు అందించేందుకు వీలుగా జ‌య నివాసంలో ఒక ఐసీయూను సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం. రెండున్న‌ర కోట్ల రూపాయాల‌తో అన్ని ర‌కాల వైద్య సేవ‌ల‌ను అందించేందుకు వీలుగా దీన్ని సిద్ధం చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

Loading...

Leave a Reply

*