జ‌య క్షేమం…!

jaya

మూడు వారాలుగా ఆస్ప‌త్రిలో జ‌య‌. బ‌య‌ట ఆమె అభిమానులు, పార్టీ కార్య‌కర్త‌లు. లోప‌ల జయ‌ను కాపాడేందుకు వైద్యుల విశ్వ ప్ర‌య‌త్నాలు. బ‌య‌ట ఆమ్మ కోలుకోవాలంటూ జ‌నం పూజ‌లు. జ‌య ప‌రిస్థితి వాక‌బు చేసేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రులు వ‌చ్చి పోతూనే ఉన్నారు. అంద‌రూ జ‌య కోలుకుంటుంద‌నే చెబుతున్నారు. అయితే, ద‌స‌రా రోజున త‌మిళ‌నాడు వాసుల‌కు తీపి క‌బురు అందింది. కేర‌ళ గ‌వ‌ర్న‌ర్‌, సీఎం విజ‌య‌న్, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీలు ఆస్ప‌త్రిలో జ‌య‌ను ప‌రామ‌ర్శించి వ‌చ్చారు. ఆ త‌ర్వాత బ‌య‌ట మాట్లాడుతూ ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేద‌ని జ‌య కోలుకుంటున్నార‌ని ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో జ‌య కొద్దిగా స్పృహ‌లోకి వ‌చ్చార‌ని క‌ళ్లు తెరిచి మాట్లాడే ప్ర‌య‌త్నం చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

దాంతో జ‌య అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఆనందం వ్య‌క్త‌మైంది. అపోలో వైద్యులు కూడా జ‌య‌కు అందిస్తున్న చికిత్స గురించిన వివ‌రాలు ప్ర‌క‌టించారు. శ్వాస సహాయక చికిత్స చేస్తున్నామని.. యాంటీబయాటిక్స్ మందులు ఇస్తున్నట్లు చెప్పిన వైద్యులు ఫిజియోథెరపీ కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప‌రిణామాల‌న్ని జ‌య ఆరోగ్యం కొద్ది కొద్దిగా కుదుట‌ప‌డుతుంద‌ని వెల్ల‌డిస్తున్నాయి. వీట‌న్నింటికంటే ముఖ్య‌మైన విష‌యం ఇంకోటుంది. రాష్ట్రం ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అమ‌లులో అనిశ్చితి రాకుండా ఉండేందుకు తాత్కాలిక సీఎంను అయినా నియ‌మించాల‌ని గ‌వ‌ర్న‌ర్ స‌హా ఇత‌ర ప్ర‌భుత్వ పెద్ద‌లు భావించి చ‌ర్చ‌లు జ‌రిపారు.

ఈ క్ర‌మంలో తెర‌మీద‌కు అనేక పేర్లు వ‌చ్చాయి. అయితే అనూహ్యంగా తాత్క‌లిక సీఎం ప్ర‌క‌ట‌న ప‌క్క‌న పెట్టేశారు. ఈ ప‌రిణామం కూడా జ‌య కోలుకుంటున్నార‌న్నదానికి సంకేతంగా నిలుస్తోంది. ఆమె కోలుకుంటున్నారు కాబ‌ట్టే… ఇక తాత్క‌లిక సీఎం నియామ‌కం అవ‌స‌రం లేద‌ని భావించిన‌ట్లు తెలుస్తోంది. దాంతో త‌మిళుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

Loading...

Leave a Reply

*