జయ పూర్తిగా… కరుణ 90% రెడీ!

jaya-lalitha

తమిళనాడులో పండగ మొదలైనట్లే. నెల రోజులుగా ఆసుపత్రికి పరిమితమైన సీఎం జయ కోలుకున్నారు. ఈ విషయాన్నీ అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. జయ మాములుగా శ్వాస తీసుకోగలుగుతున్నారని ఆయన చెప్పారు. రెండు రోజుల్లో జయని మాములు వార్డ్ కి మారుస్తామని. ఆ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత జయ ఎప్పుడైనా ఇంటికి వెళ్లవచ్చని ప్రతాప్ రెడ్డి చెప్పారు. గత నెల రోజులుగా జయ ఆస్పత్రిలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యం మీద ఆందోళనకి గురైన ఆమె అభిమానులు పూజలు వ్రతాలూ చేస్తూ అపోలో ఆస్పత్రి వద్దనే పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే.

ప్రజల పూజలు వైద్యుల కృషి జయని మాములు మనిషిని చేశాయని ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. ఇక మరోవైపు అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్న డీఎంకే అధినేత కరుణ కూడా 90% కోలుకున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. మొత్తానికి తమిళ ప్రజల కోరిక ఫలించి ఇద్దరు నేతలు పూర్తిగా కోలుకోవడం తో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Loading...

Leave a Reply

*