అమ్మ ఆస్ప‌త్రిలోనే… త‌మిళ‌నాడులో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌

amma

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఆరోగ్యం మెరుగుప‌డ‌లేదు. ఆమెను మ‌రికొంత కాలం ఆస్ప‌త్రిలోనే ఉంచాల‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర రాజ‌కీయ చిత్రం మారిపోతుంది. ముఖ్య‌మంత్రి ఆస్ప‌త్రిపాలు కావ‌డంతో రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌న్న డిమాండ్లు ఊపందుకున్నాయి. బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఈ మేర‌కు డిమాండ్ చేశారు. రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఒక లేఖ రాశారు. అనారోగ్యంతో ఉన్న సీఎం విధులు నిర్వ‌ర్తించ‌లేక‌పోతున్నార‌ని ఆమె కోలుకునే వ‌ర‌కూ రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న అమ‌లు చేయాల‌ని కోరారు. దాంతో పాటు రాష్ట్రంలో బ‌య‌ట‌ప‌డుతున్న ఐసీస్‌ ఉగ్ర‌వాద లింకుల‌ను కూడా స్వామి అందులో ప్ర‌స్తావించారు. ఇప్ప‌టికే ఐసీస్‌కు చెందిన స్లీప‌ర్ సెల్స్‌గా ప‌ని చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశార‌ని ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంద‌ని స్వామి కేంద్రం హోం మంత్రి దృష్టికి తెచ్చారు.

Loading...

Leave a Reply

*