స్పెష‌ల్ వార్డుకు జ‌య‌…. త్వ‌ర‌లో ఇంటికి

jaya-lalitha

నెల‌న్న‌ర‌కు పైగా ఆస్ప‌త్రిలోని ఐసీయూలోనే చికిత్స పొందుతున్న త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌ను నేడు స్పెష‌ల్ వార్డుకు మార్చ‌నున్నారు. ప్ర‌స్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నార‌ని, శ్వాస‌కోశ సంబంధ ఇబ్బందులు తొల‌గిపోవ‌డంతో వెంటిలెట‌ర్ తొల‌గించామ‌ని వైద్యులు తెల‌పిన సంగ‌తి విధిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆమెను ప్ర‌త్యేక వార్డుకు మార్చి కొన్ని రోజులు త‌మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచుకోనున్న‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. ఇందుకోసం ఆస్ప‌త్రి రెండో అంత‌స్తులో ప్ర‌త్యేకంగా ఒక వార్డును సిద్ధం చేశారు. ఇక్క‌డే వారం రోజుల త‌ర్వాత సింగ‌పూర్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఫిజియోథెర‌పీ చికిత్స‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి.

మ‌రో 15 రోజులు పాటు జ‌య ప్ర‌త్యేక వార్డులోనే ఉండాల్సి ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఇక‌, ప్ర‌స్తుతం జ‌య ఇంటి నుంచి వ‌చ్చిన భోజ‌నాన్నే తింటున్నారు. అలాగే, ఏదైనా తినాల‌ని అనిపించినప్పుడు ఆస్ప‌త్రి క్యాంటిన్‌లోనే తేలిక‌గా జీర్ణ‌మ‌య్యే ఆహార‌ప‌దార్ధాల‌ను త‌యారు చేయించి జ‌య‌కు అంద‌జేస్తున్న‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. ఆస్ప‌త్రి బెడ్‌పైనే ప‌డుకుని విశ్రాంతి తీసుకుంటున్న జ‌య‌… రోజువారీ టీవీల్లో వ‌చ్చే కార్య‌క్ర‌మాల‌ను వీక్షిస్తున్నారు. జ‌య కోలుకోవ‌డంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌ల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయింది. ఇప్ప‌టికే ఆస్పత్రి ప్రాంగ‌ణాన్ని దేవాల‌యంగా మార్చేసిన ఆమె అభిమానులు సోమ‌వారం ఇక్క‌డే ప్ర‌త్యేకంగా కుంభాభిషేకం నిర్వ‌హించారు.

Loading...

Leave a Reply

*