ప‌వ‌న్ మూడో స‌భ షురూ

untitled-1

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మ‌ళ్లీ బ‌రిలోకి దిగుతున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం రెండు స‌భ‌లు నిర్వ‌హించి రాష్ట్రంలో వేడి పుట్టించిన ప‌వ‌న్ మ‌రో స‌భ‌తో ముందుకొస్తున్నారు. ఈసారి మ‌ళ్లీ త‌న ఉద్య‌మ స్థానంగా రాయ‌ల‌సీమ జిల్లానే ఎంచుకున్నారు. తొలి స‌భ తిరుప‌తిలో పెట్టిన ప‌వ‌న్ ఇప్పుడు మూడో స‌భ‌ను క‌రువు సీమ అనంత‌పురంలో నిర్వ‌హించాల‌ని నిర్ణయించారు. వ‌చ్చే నెల(న‌వంబ‌ర్‌) ప‌దిన ఈ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు జ‌న‌సేన అదికారికంగా వెల్ల‌డించింది. కాకినాడ స‌భ త‌ర్వాత హోదా పోరు కొన‌సాగిస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ దానికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.

అదే స‌మ‌యంలో కాకినాడ స‌భ‌లో అభిమాని మృతితో క‌ల‌త చెందిన ఆయ‌న ఇక‌పై స‌భ‌లు నిర్వ‌హించ‌న‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే, ఏమైందో ఏమో కానీ మూడో స‌భ‌కు తేదీ ప్ర‌క‌టించారు. తిరుప‌తి స‌భ‌తో రాష్ట్ర విష‌యంలో కేంద్రం ఏదోక నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి క‌ల్పించిన ప‌వ‌న్ ఆ త‌ర్వాత కాకినాడ స‌భ‌ను ప్ర‌క‌టించి ప్యాకేజీ అయినా త‌క్ష‌ణం ఇచ్చేలా కేంద్రం మెడ‌లు వంచ‌గ‌లిగారు. కాకినాడ స‌భ‌లో కేంద్రంపై విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోయిన ప‌వ‌న్ వైఖ‌రితో అధికార బీజేపీ ఆ త‌ర్వాత ఎంత‌గా గింజుకుందో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలిసిందే. వెంకయ్య నాయుడు అయితే నిన్న మొన్న‌టి వ‌ర‌కూ ప‌వ‌న్‌ను ప‌రోక్షంగా విమ‌ర్శిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు అనంత‌పురంలో నిర్వ‌హించ‌బోయే మూడో స‌భ ద్వారా ప‌వ‌న్ ఏం చేయ‌బోతున్నారో అని రాష్ట్ర ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Loading...

Leave a Reply

*