సొంత‌గ‌డ్డ‌లోనే జ‌గ‌న్ ఓట‌మి 

jagan-ysrcp-defeated-in-kadapa-local-elections

క‌డ‌ప‌… అది జ‌గ‌న్ గ‌డ‌ప‌… కడ‌ప జిల్లా వైఎస్సార్సీకి ఖిల్లా… అలాంటి కంచుకోట‌లోనే ఇప్పుడు జ‌గ‌న్ ఓట‌మి పాల‌య్యాడు.. ఇది జ‌గ‌న్‌కు మామూలు షాక్ కాదు… దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాక్‌… సైకిల్ సైన్యం జ‌గ‌న్ పార్టీని క‌డ‌ప‌లోనే కొట్టింది…. టీడీపీ చేతిలో వైఎస్సార్సీ ఘోర ఓట‌మి పాల‌యింది… చిన‌బాబు లోకేష్ స్కెచ్చో లేక జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా చ‌క్రం తిప్పాడో కానీ మొట్ట‌మొద‌టిసారిగా క‌డ‌ప జిల్లాలో వైఎస్సార్సీపై టీడీపీ పైచేయి సాధించ‌గ‌లిగింది…క‌డ‌ప జిల్లాలో జ‌రిగిన ఎంపీపీ ఉపఎన్నిక‌ల్లో టీడీపీ స‌త్తా చాటింది.. రెండు మండ‌ల ప్ర‌జా ప‌రిష‌త్తుల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది… వైఎస్సార్సీ ఒక ఉప ఎంపీపీ ప‌ద‌వితోనే స‌రిపెట్టుకుంది… కోరం లేని కార‌ణంగా వేముల ఉప ఎంపీపీ ఎన్నిక వాయిదా ప‌డింది…పుల్లంపేట‌, వీర‌పునాయునిప‌ల్లె మండ‌లాల్లో జ‌రిగిన ఎంపీపీ ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టి పోటీ ఇచ్చినా టీడీపీ విజ‌యం సాధించింది….

అంత‌కుముందు వైసీపీ చేతుల్లో ఉన్న పుల్లంపేట‌, వీర‌పునాయునిప‌ల్లె మండ‌లాల్లో ఆ పార్టీ ఆధిప‌త్యానికి టీడీపీ గండి కొట్టింది…..అయితే వేంప‌ల్లె ఉప మండ‌లాధ్య‌క్ష ప‌ద‌విని మాత్రం వైఎస్సార్సీ చేజిక్కించుకోగ‌లిగింది… వేముల ఉప మండ‌లాధ్యక్ష‌ ప‌ద‌వికి ఎన్నిక వాయిదా ప‌డింది… జిల్లాలో మొద‌టిసారిగా గ్రామ‌స్థాయిలో వైసీపీని దెబ్బ‌తీసి టీడీపీ పుంజుకుంది…. క‌డ‌ప జిల్లాలో చోటు చేసుకున్న ఈ రాజ‌కీయ ప‌రిణామాలు జ‌గ‌న్‌కు ప్ర‌మాద సంకేతాలని,  క‌డ‌ప కోట‌ను కాపాడుకోకుంటే అది జ‌గ‌న్ చేజారిపోయే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు… క‌డ‌ప జిల్లాలోనే త‌మ పార్టీ ఓట‌మిని జ‌గ‌న్ ఎలా జీర్ణించుకుంటాడో చూడాలి…. త‌న కంచుకోట‌ను కాపాడు కోవ‌డానికి ఆయ‌న ఎలాంటి ఎత్తులు వేస్తాడో అని జిల్లా జ‌నం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Loading...

Leave a Reply

*