హైద‌రాబాద్ వీడి జ‌గ‌న్ ఎందుకు రారు?

jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయి రెండున్న‌రేళ్లు అవుతోంది. చంద్ర‌బాబు హైద‌రాబాద్ వీడి ఏడాదిన్న‌ర అవుతోంది. ఏపీలో క్రీయాశీలంగా ఉండాల‌ని భావించిన‌ రాజ‌కీయ పార్టీల‌న్నీ ఏపీ రాజ‌ధానికి మ‌కాం మార్చేశాయి. ఉద్యోగులు కూడా ఏపీ రాజ‌ధానికి వెళ్లిపోయారు. వ‌చ్చే విడ‌త అసెంబ్లీ స‌మావేశాలు కూడా కొత్త రాజ‌ధానిలోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. హైద‌రాబాద్ ఇంకో ఏడున్న‌రేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధాని అయిన‌ప్ప‌టికీ… ఏపీకి వెళ్లాల్సిన వాళ్లంతా ఇప్ప‌టికే హైద‌రాబాద్ వీడి వెళ్లిపోయారు. అయితే, హైద‌రాబాద్ వీడ‌ని ఒకే ఒక్క వ్య‌క్తి జ‌గ‌న్‌. ఆయ‌న పార్టీ వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌య‌మూ హైద‌రాబాద్‌లోనే ఉంది.

ఏపీలోని జిల్లాల్లో యువ‌భేరీ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్న జ‌గ‌న్ ఆ కార్య‌క్ర‌మాల‌కు హైద‌రాబాద్ నుంచే వెళ్లివ‌స్తున్నారు. అయితే, అంద‌రూ హైద‌రాబాద్ వ‌దిలి వెళ్లిపోతున్న ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ మాత్రం ఉమ్మ‌డి రాజ‌ధాని ఎందుకు వ‌ద‌ల‌లేక‌పోతున్నార‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. టీడీపీ నేత‌లు కూడా ముందు హైద‌రాబాద్ వ‌దిలి వ‌చ్చి మాట్లాడు అంటూ స‌వాళ్లు విసురుతున్నారు. తెలంగాణ‌లో పార్టీ ఉండి… నేత‌లు ఉన్న చంద్ర‌బాబే ఏపీకి మ‌కాం మార్చారు.

తెలంగాణ‌లో పార్టీని పూర్తిగా కేసీఆర్‌కు అప్ప‌గించేసిన జ‌గ‌న్ మాత్రం హైద‌రాబాద్ ఎందుకు వీడ‌డం లేద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీలో ఎద‌గాల‌ని, త్వ‌ర‌లో సీఎం ప‌ద‌వి చేప‌ట్టాల‌ని క‌ల‌లుగ‌నే జ‌గ‌న్ అక్క‌డే ఉంటూ పార్టీని ఎందుకు న‌డ‌ప‌ర‌న్న‌ది ఏపీ జనం అనుమానం. దేశంలో ఎవ‌రు ఎక్క‌డైనా ఉండొచ్చు. ఆ స్వేచ్ఛ అంద‌రికీ ఉంది. అయితే, ఏపీలో అధికారం చేప‌ట్టాల‌నుకుంటున్న జ‌గ‌న్ మాత్రం ఎందుకు ఏపీలో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్న‌దే ప్ర‌శ్నం. హైద‌రాబాద్‌లో ఉండి ఏపీ జ‌నాన్ని ఆక‌ట్టుకుంటార‌న్న‌దే ఇప్పుడు చ‌ర్చంతా.

Loading...

Leave a Reply

*